ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(72) గుండె పోటుతో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను గత నెల ఓ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. సరోజ్ ఖాన్ మరణవార్తతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సినీ ఇండస్ట్రీలో 'మాస్టర్ జీ' 'మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ' అని ప్రేమగా పిలిచే సరోజ్ ఖాన్ ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. కాగా సరోజ్ ఖాన్ మరణంతో ఆమె గురించి తెలుసుకుంటున్న నెటిజన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన చివరి పోస్టు చూసి ఉద్వేగానికి గురవుతున్నారు.
సరోజ్ ఖాన్ చివరిసారిగా జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటనపై పోస్టు పెట్టారు. ‘‘నేను మీతో ఎప్పుడూ కలిసి వర్క్ చేయలేదు కానీ సుశాంత్ మనం చాలాసార్లు కలుసుకున్నాం. మీ జీవితంలో ఏం తప్పు జరిగింది? మీరు మీ లైఫ్ లో ఇంత తీవ్రమైన స్టెప్ వేసినందుకు నేను షాక్ అయ్యాను. దేవుడు మీ ఆత్మకు శాంతి చేకూర్చుగాక. మీ తండ్రి మరియు సోదరి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఈ సమయంలో వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. నేను మీ అన్ని సినిమాల్లోనూ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తాను'' అంటూ సరోజ్ ఖాన్ సుశాంత్ మృతి పట్ల ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టి సంతాపం తెలిపారు. సుశాంత్ మరణం పట్ల సంతాపం తెలిపిన 20 రోజుల్లోనే సరోజ్ ఖాన్ మరణించడంతో సినీలోకం దిగ్భ్రాంతికి లోనైంది.
ఇదిలా ఉండగా సరోజ్ ఖాన్ మూడేళ్ళ వయస్సులోనే బ్యాగ్రౌండ్ డ్యాన్సర్ గా ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఇక 'గీతా మేరా నామ్' సినిమాకి ఆమె మొదటిసారిగా కొరియోగ్రఫీ చేశారు. బాలీవుడ్ లో దాదాపు 2000వేల పాటలకు పైగా ఆమె కొరియోగ్రఫీ చేశారు. 'మిస్టర్ ఇండియా'లోని హవా హవాయి.. 'తేజబ్' లోని ఏక్ దో దీన్.. 'దేవదాస్' లో 'డోలా రే డోలా' వంటి హిట్ సాంగ్స్ కి ఆమె నృత్య దర్శకురాలిగా వ్యవహరించారు. చివరిసారిగా గతేడాది వచ్చిన 'కళంక్' సినిమాలో తాహబ్ హో గయే పాటకు ఆమె డ్యాన్స్ కంపోజ్ చేశారు. సరోజ్ ఖాన్ మూడు సార్లు జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక సరోజ్ ఖాన్ సోహన్ లాల్ ని పెళ్లి చేసుకోగా.. వారికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.