బన్నీ, మహేష్ లకి సర్దార్ షాకిచ్చాడా?

Update: 2016-04-18 05:19 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చిన షాక్ పెద్దదే. లోకల్ గా కంటే ఓవర్సీస్ బయ్యర్లకు ఈ దెబ్బ మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటివరకూ అక్కడ అమ్మిన రేట్ల ప్రకారం, వసూలు చేయాల్సిన మొత్తంలో కనీసం సగానికి కూడా రీచ్ కాలేదు సర్దార్.

ఈ ప్రభావం రానున్న చిత్రాలైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు - సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవంలపై బాగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాలకు సంబంధిచిన రైట్స్ ను భారీ రేట్లకు ఓవర్సీస్ లో అమ్మేశారు. కానీ సర్దార్ రిజల్ట్ చూశాక.. అక్కడి కొనుగోలు దారులందరూ సబ్ లీజ్ లకు ఈ సినిమాను ఇచ్చేస్తున్నారు. స్క్రీన్లు - ఏరియాల్లెక్కన ఇచ్చేస్తుండడంతో.. వీళ్ల టార్గెట్ మరింతగా పెరిగిపోతోందని టాక్.

బయ్యర్లకు అమ్మిన మొత్తం కంటే.. సబ్ లీజ్ దారులు కొనుగోలుచేసిన మొత్తాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ అమౌంట్ రికవర్ చేయాలంటే.. శక్తికి మించిన పనే అంటున్నారు. ప్రస్తుతం అక్కడి బయ్యర్లు కూడా ఓ సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరో ఐదు రోజుల్లో విడుదలవుతున్న సరైనోడు ఈ హిట్ ఇస్తాడని ఆశగా ఉన్నారు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు.
Tags:    

Similar News