సరైనోడు అవార్డు కొట్టాడు.. కానీ...

Update: 2016-10-03 10:44 GMT
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ జరుగుతోంది. అక్కడే ఇంటర్నేషనల్ ఫిలిం బిజినెస్ అవార్డ్స్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్లకు అలాగే పంపిణీదారులకు వీరు అవార్డులను అందరజేస్తారు. ఇప్పుడు వీరిచ్చిన ఒక అవార్డు ఫిలిం నగర్లో కొన్ని కొత్త ప్రకంపనలు రేపుతోంది మరి.

నిజానికి ఈ ఏడాది 'సరైనోడు' సినిమా బిగ్గెస్ట్ హిట్ అనే విషయం నిజమే. కాకపోతే ఆల్రెడీ జనతా గ్యారేజ్ సరైనోడు గ్రాస్ ను ఓవర్ టేక్ చేసింది అనేదే ఇప్పటివరకు మనకు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్న విషయం. కాని అనూహ్యంగా ఇప్పుడు 2016కు గాను ''హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ'' అంటూ 'సరైనోడు'కు వీరు అవార్డు ఇచ్చారు. ఇక్కడే జనాలకు రుచించట్లేదు. అయితే కేవలం ఈ అవార్డులు డిసైడ్ చేసిన డేట్ వరకే కన్సిడర్ చేసి వీరు సరైనోడుకు అవార్డును ఇచ్చుంటారులే. జనతా గ్యారేజ్ సంగతి పక్కనెట్టేసినా కూడా.. ఈ ఏడాదిలో ఇంకా 3 నెలలు పెండింగ్ ఉన్నాయి.. వచ్చే సినిమాల్లో ఎవరన్నా కూడా బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్సుంది. అలాంటప్పుడు వీరు ముందే 2016కు ఎలా అవార్డులు ఇచ్చేస్తారు?

చూస్తుంటే గత ఏడాది హాఫ్‌ ఇయర్లీ క్లోజింగ్ డే నుండి ఈ ఏడాది క్లోజింగ్ డే (సెప్టెంబర్ 30)  వరకు చూసి అవార్డులు ఇచ్చారేమోలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News