ఓటీటీ రాకతో చిన్న సినిమాలకు మరియు మంచి కంటెంట్ మేకర్స్ కు లాభదాయకంగా మారింది. ఇక పాత సినిమాలకు ఏవో కారణాల వల్ల విడుదల కాకుండా ఉన్న సినిమాలకు సెన్సార్ రాని సినిమాలకు ఇప్పుడు క్లియరెన్స్ వస్తుంది. ఈ లాక్ డౌన్ టైంలో ఎన్నో పాత సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇప్పుడు మరికొన్ని సినిమాలు కూడా రాబోతున్నాయి. తమిళంలో రూపొందిన త్రిష మూవీ 'సతురంగ వెట్టై 2' సినిమా ఇప్పుడు విడుదలకు రెడీ అవుతోది.
అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగానో లేదా మరే కారణంగానో విడుదలకు నోచుకోవడం లేదు. ఈ సినిమాను అరవింద్ స్వామి విడుదల కాకుండా అడ్డుకుంటున్నాడు అంటూ కూడా ఆమద్య తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక సినిమా ఎప్పటికి ల్యాబ్ కే పరిమితం అవ్వాల్సిందే అనుకున్నారు. కాని ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారట. ఇప్పటికే ఓటీటీ కి అమ్మేయడం కూడా జరిగి పోయిందట.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే నెలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారట. సినిమా ప్రమోషన్ కు అరవింద్ స్వామి హజరు అవ్వక పోవచ్చు అంటున్నారు. అయితే త్రిష అభిమానులు మాత్రం ఈ సినిమాకు భారీ పబ్లిసిటీ కల్పించేందుకు రెడీ అవుతున్నారు. అరవింద్ స్వామి ఈ సినిమాలో నటించినప్పటికి మెజార్టీ రోల్ త్రిషదే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కనుక ఈ సినిమా ఈ సమయంలో త్రిషకు చాలా కీలకం అంటున్నారు. అందుకే ఆమె కూడా సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తుందట.