35 ఏళ్ల విరామం త‌రువాత క‌మ‌ల్ తో..!

Update: 2022-08-11 02:30 GMT
స‌త్య‌రాజ్ 35 ఏళ్ల విరామం త‌రువాత క‌మ‌ల్ తో మ‌ళ్లీ క‌లిసి వ‌ర్క్ చేయ‌బోతున్నారు. ఈ ఇద్ద‌రు క‌లిసి 35 ఏళ్ల క్రితం 1986లో వ‌చ్చిన `విక్ర‌మ్` లో న‌టించారు. అందులో స‌త్య‌రాజ్ మెయిన్ విల‌న్ గా క‌నిపించారు. ఒంటిక‌న్నుతో విచిత్ర‌మైన వేష‌ధార‌ణ‌తో విల‌న్ గా ఆక‌ట్టుకున్నారు. ఈ మూవీ త‌రువాత మ‌ళ్లీ క‌మ‌ల్ తో స‌త్య‌రాజ్ క‌లిసి న‌టించ‌లేదు. మ‌ధ్య‌లో 2015లో `మ‌రుద‌నాయ‌కం`లో న‌టించాల్సింది. కానీ అది మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డంతో మ‌రో సినిమాలో క‌మ‌ల్ తో క‌లిసి న‌టించ‌లేక‌పోయారు.

మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు క‌మ‌ల్ తో క‌లిసి న‌టిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. నాలుగేళ్ల విరామం త‌రువాత `విక్ర‌మ్`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాసన్‌. ఈ మూవీతో ఊహించ‌ని బ్లాక్ బస్ట‌ర్ ని సొంతం చేసుకున్నారు.

లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ క‌మ‌ల్ కెరీర్ లోనే అత్యంత భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన మాసీవ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ మూవీ త‌రువాత మంచి జోష్ తో వున్న క‌మ‌ల్ ఆగిపోయిన `ఇండియ‌న్ 2` ప‌ట్టాలెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

క‌మ‌ల్‌, కాజ‌ల్ ల‌పై కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో క్రేజ్ విరిగిప‌డి నాలుగురు యూనిట్ మెంబ‌ర్స్ మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ కు, లైకా ప్రొడ‌క్ష‌న్స్ కు మ‌ధ్య త‌లెత్తిన అభిప్రాయ బేధాల కార‌ణంగా `ఇండియ‌న్ 2` ఫైన‌ల్ షెడ్యూల్ నిర‌వ‌ధికంగా ఆగిపోయింది. అంతే కాకుండా కాజ‌ల్ ప్రోగ్నెంట్ కావ‌డం, సినిమాలోని కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన వివేక్‌, నెడుముడి వేణు ఇటీవ‌ల మృతి చెంద‌డంతో షూటింగ్ కి అంత‌రాయం ఏర్ప‌డింది.

ఇటీవ‌ల కాజ‌ల్ తాను షూటింగ్ కి రెడీ అని అధికారికంగా వెల్ల‌డించ‌డం, క‌మ‌ల్ కూడా తాను కూడా రెడీ అంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో `ఇండియ‌న్ 2` ఫైన‌ల్ షెడ్యూల్ కి ఏర్పాట్లు జ‌క జ‌కా జ‌రిగిపోతున్నాయి. కాజ‌ల్ సెప్టెంబ‌ర్ 13 నుంచి సెట్ లోకి అడుగుపెట్ట‌డానికి రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. ఈ మూవీలోకి కీల‌క పాత్ర‌లో స‌త్య‌రాజ్ న‌టిస్తున్నార‌ని తెలిసింది. నెడుముడి వేణు మ‌ధ్య‌లోనే చ‌నిపోవ‌డంతో ఆయ‌న పాత్ర‌ని స‌త్య‌రాజ్ తో భ‌ర్తి చేస్తూ రీ షూట్ చేయ‌బోతున్నార‌ట‌.

అంతే కాకుండా వివేక్ పాత్ర‌ని కూడా క‌ట్ చేసి ఆ పాత్ర‌లో సీనియ‌ర్ హీరో కార్తీక్ తో రీప్లేస్ చేస్తున్నార‌ట‌. ఈ ఇద్ద‌రి పాత్ర‌లకు సంబంధించిన రీ షూట్ ని త్వ‌ర‌లోనే ప్రారంభించనున్న‌ట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధికారికంగా వెల్ల‌డించ‌నుంద‌ని కోలీవుడ్ స‌మాచారం.
Tags:    

Similar News