ప్రియాంక చోప్రాకు గ్లోబల్ సుందరి అని పేరు. తన గ్లోబల్ ట్యాగ్ కు తగ్గట్టే ఎంతో ఫ్యాషనబుల్ దుస్తులు ధరిస్తుంది. అన్నీ డిజైనర్ దుస్తులే. ఫ్యాషన్ రంగ నేపథ్యం నుంచి వచ్చిన భామ కావడంతో స్టైల్ పీక్స్ లో ఉంటుంది. కానీ ఎందుకో ఈమధ్య ప్రియాంక ఫ్యాషన్ అప్పుడప్పుడూ వికటిస్తోంది. పెద్ద చదువులు చదివితే ఉన్న తెలివి కాస్తా పోయిందని అప్పుడప్పుడూ పాత కాలం వాళ్ళు నెక్స్ట్ జెన్ కిడ్స్ పై సెటైర్ వేస్తుంటారు. అలానే ఫ్యాషన్ ఎక్కువై ప్రియాంకకు డ్రెస్ సెన్స్ తగ్గినట్టుందని ఈమధ్య సెటైర్లు పడుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం మెట్ గాలా లో ఒక దిక్కుమాలిన డ్రెస్ వేసుకోవడంతో ట్రోలింగ్ భారీగా జరిగింది. ఆ డ్రెస్ థీమ్ కు తగ్గట్టు వేసుకుందని కొందరు వెనకేసుకొచ్చారు కానీ అంత పిచ్చి డ్రెస్ మరే ఇతర సెలబ్రిటీ కూడా వేసుకోకపోవడం గమనార్హం. థీమ్ పేరుతో సెన్స్ లెస్ డ్రెస్ వేసుకోవడాన్ని చాలామంది తప్పుపట్టారు. మందిరా బేడి ప్రియాంక మెట్ గాలా డ్రెస్ పై గట్టిగా సెటైర్ వేసింది. ఇక మరో సందర్భంలో భారతీయ చీరకట్టును ప్రపంచానికి మరోసారి పరిచయం చేస్తానంటూ ఈమధ్య చీరతో ఫోటో షూట్ చేసింది. అది కూడా అంతంతమాత్రంగానే ఏడ్చింది. బ్లౌజ్ లేకుండా ఫోటో షూట్ చేసింది.. కొన్ని ఫోటోల్లో బ్లౌజ్ కు బదులుగా ఇన్నర్ మాత్రమే ధరించింది. హాటు అందాలు చూసి చప్పరించే ఇన్స్టా బ్యాచ్ తప్ప మిగతా జనాలు ప్రియాంకను గట్టిగా ట్రోలింగ్ చేశారు. నువ్వు హాట్ షో చెయ్యాలనుకుంటే వేరే డ్రెస్సులు వేసుకొని చెయ్.. మాకేమీ అభ్యంతరం లేదు కానీ ఇది ఇండియన్ డ్రెస్ అంటూ చీర పరువు తీయకు అంటూ గడ్డిపెట్టారు.
అయితే ఈ ట్రోలింగ్ తో సంబంధం లేకుండా ఈ జఫ్ఫా డ్రెస్సింగ్ ఉద్యమాన్ని ఆపకుండా కొనసాగిస్తోంది ప్రియాంక. తాజాగా ప్రియాంక 'చేజింగ్ హ్యాపీనెస్' అనే డాక్యుమెంటరీ ప్రీమియర్ కు తన భర్త నిక్ జోనాస్ తో కలిసి హాజరయింది. జోనాస్ బ్రదర్స్ ముగ్గురిపై తెరకెక్కించిన డాక్యుమెంటరీ కావడంతో జోనాస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ప్రియాంక ధరించిన డ్రెస్ ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. ఫ్రంట్ వీ నెక్ తో పాటుగా థై స్లిట్ కూడా ఉంది. కాకపోతే ఆ థై స్లిట్ మరింత ఎక్కువగా ఉండడంతో ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. ఈ డ్రెస్ ను కూడా మెచ్చుకునే జనాలు లేకపోలేదు కానీ ట్రోలింగ్ మాత్రం వెంటనే స్టార్ట్ అయింది.
ఏదో ఒక డ్రెస్ ను జనాలు ట్రోలింగ్ చేస్తే.. ఆ డ్రెస్ మాత్రమే నచ్చలేదేమో ప్రియాంక ఫ్యాషన్ సెన్స్ కరెక్ట్ గానే ఉంది అని సరిపెట్టుకోవచ్చు. వారంలో ఒకసారి ఆమె వేసుకున్న ఏదో ఒక డ్రెస్ ట్రోలింగ్ కు గురవుతోంది అంటే ఆమె ఫ్యాషన్ సెన్స్ సరిగా లేనట్టు.. లేకపోతే ఆమె స్టైలిస్ట్ ను మార్చాల్సిన అవసరం ఉన్నట్టు!