రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎంత చెత్తగా తయారైనా.. ఎన్ని ఫ్లాపులు వచ్చినా.. ఆయన మాత్రం ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగానే నిలుస్తుంటాడు. వర్మ అంత ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ మరి. కేవలం సినిమాల విషయంలోనే కాక అనేక విషయాల్లో వర్మ హాట్ టాపిక్ అవుతుంటాడు. తాజాగా ఆయన తన కొత్త సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తనదైన శైలిలో జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ‘వెన్నుపోటు’ పేరుతో వర్మ రిలీజ్ చేసిన పాట ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ పాట టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిందన్నది బహిరంగ రహస్యం. ఐతే ఈ పాటను తెలుగుదేశం నాయకులు.. కార్యకర్తలు ఎంత ఇగ్ నోర్ చేస్తే అంత బాగుండేది. కానీ వాళ్లు అలా చేయలేదు. వర్మ మీద ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కొందరేమో ఆయన దిష్టిబొమ్మల్ని దహనం చేశారు.
ఇక వర్మ ఊరుకుంటాడా? కౌంటర్ అటాక్ మొదలుపెట్టాడు. ఈ వివాదం వేడిలో చలి కాచుకోవడం మొదలుపెట్టాడు. రివర్సులో ఎస్వీ మోహన్ రెడ్డికి ఆయన లీగల్ నోటీసు పంపాడు. మరి వర్మ ఇచ్చిన బ్రీఫింగ్ తో ఈ నోటీసు తయారు చేశాడో లేదంటే ఆ లాయర్ కూడా వర్మ లాంటివాడోనో తెలియదు కానీ.. ఆ నోటీసులో భలే పాయింట్లు మెన్షన్ చేశాడు. వెన్ను పోటు పాటకు సంబంధించిన ఫిర్యాదులో చంద్రబాబుకు పరువుకు భంగం కలిగించేలా ఈ పాట ఉండటం వల్ల వర్మపై చర్యలు చేపట్టాలని మోహన్ రెడ్డి పేర్కొన్నారని.. కానీ తన పరువుకు భంగం కలిగిందని భావించిన వాళ్లే దావా వేయాలన్న ప్రాథమిక విషయాన్ని మరిచిపోయారంటూ ఈ నోటీసులు ఎద్దేవా చేశారు. ఇలాంటి లా పాయింట్లు ఇందులో చాలానే ఉన్నాయి. చంద్రబాబును చాలా ఇబ్బందికి గురి చేసేలా.. ఆయన వెన్నుపోటు వ్యవహారం గురించి మరింత రచ్చ జరిగేలా ఈ నోటీసు ఉంది. సోషల్ మీడియాలో ఇందులోని వివిధ పాయింట్లను అండర్ లైన్ చేసి.. తెలుగుదేశం వాళ్లతో ఒక ఆట ఆడుకుంటున్నారు ప్రత్యర్థి పార్టీల వాళ్లు.