ఈ మధ్య టాలీవుడ్ రీమేక్ ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా తమిళ సినిమాలను ఇప్పుడు ఎక్కువగా రీమేక్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రేక్షకులకు తెలిసి కొన్ని రీమేక్స్ జరుగుతుంటే మరికొన్ని ప్రేక్షకులకు తెలియకుండా స్ట్రైట్ సినిమాగా తెరకెక్కుతున్నాయి. అలాంటి రీమేక్ లో ఒకటి 'ఎంత మంచి వాడవురా'. అవును కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గుజరాతి 'ఆక్సిజన్' సినిమాకు రీమేక్.
అయితే ఈ విషయాన్ని ఇంత వరకూ మేకర్స్ ఎక్కడ చెప్పకుండానే షూట్ పూర్తి చేసారు. సంక్రాంతికి రానున్న ఈ సినిమా రీమేక్ అని చెప్పకపోవడానికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉందట. అదేంటంటే ఆక్సిజన్ కథను చాలా వరకూ మార్చి సతీష్ వేగేశ్న తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా కొత్త సన్నివేశాలు రాసుకున్నాడట.
ఆల్మోస్ట్ సినిమాలో యాబై శాతం మాత్రమే ఒరిజినల్ సన్నివేశాలుంటాయట. అందుకే ఈ సినిమాను పూర్తి రీమేక్ గా ప్రకటించకుండా స్ట్రైట్ సినిమాలా ప్రాజెక్ట్ చేస్తున్నారని సమాచారం. ఏదేమైనా ఈ మధ్య రీమేక్ సినిమాలు మక్కీ కి మక్కీ దించేస్తూ పైకి సోల్ మాత్రమే తీసుకున్నాం అని చెప్పడం అలవాటు అయిపోయిందిలే. మరి సతీష్ కూడా అదే కోవలోకి వస్తాడా నిజంగానే కథలో మార్పులు చేసాడా ఈ సంక్రాంతికి తేలిపోతుంది.