ఎవరీ సతీశ్ వేగేశ్న?

Update: 2017-01-16 08:51 GMT
శతమానం భవతి.. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన చిత్రం. రెండేళ్ల కిందటే ఈ ప్రాజెక్టును కన్ఫమ్ చేశాడు రాజు. గత ఏడాది ద్వితీయార్ధంలో సినిమాను మొదలుపెట్టి నాలుగు నెలల్లో పూర్తి చేసి.. సంక్రాంతికి భారీ చిత్రాల మధ్య ఈ సినిమాను బరిలో నిలిపారు. పాజిటివ్ టాక్ తో మొదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా విడుదలకు ముందు అందరూ దిల్ రాజు గురించే మాట్లాడుకున్నారు. కానీ సినిమా విడుదలయ్యాక చర్చ ఈ చిత్ర దర్శకుడి చుట్టూ తిరుగుతోంది. భారీ తారాగణంతో ముడిపడ్డ ఈ చిత్రాన్ని ఏ తడబాటు లేకుండా.. అందంగా తెరకెక్కించిన సతీశ్ వేగేశ్న గురించి అందరూ ఆరా తీస్తున్నారు.

సతీశ్ వేగేశ్నను చాలామంది డెబ్యూ డైరెక్టర్ గా భావిస్తున్నారు. సతీశ్ కొత్తవాడు కావడంతో దిల్ రాజే ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరించాడని.. ఘోస్ట్ డైరెక్షన్ కూడా చేసేశాడని ఆ మధ్య ఊహాగానాలు వినిపించాయి. కానీ నిజానికి అలాంటిదేమీ లేదు. అసలు సతీశ్ డెబ్యూ డైరెక్టర్ కాదు. అతను దర్శకుడిగా ఇప్పటికే రెండు సినిమాలు తీశాడు. రచయితగా చాలా సినిమాలకు పని చేశాడు. ‘ఈనాడు’ పత్రికలో టీపీ ఆపరేటర్‌ గా సతీశ్ ప్రస్థానం మొదలైంది. ఐతే సినిమాల మీద ఆసక్తితో అతను ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. సీనియర్ డైరెక్టర్ ముప్పలనేని శివ సహకారంతో రచయితగా అవకాశాలు సంపాదించాడు. ‘కబడ్డీ కబడ్డీ’ సినిమాతో రచయితగా సతీశ్ కు మంచి పేరొచ్చింది. తర్వాత అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘అత్తిలి సత్తిబాబు’తో పాటు ఇంకొన్ని కామెడీ సినిమాలకు మాటలు రాశాడు. 2008లో అల్లరోడి సినిమా ‘దొంగలబండి’తో దర్శకుడిగామారాడు. ఆపై ‘రామదండు’ అనే మరో సినిమా కూడా తీశాడు. ఇవి రెండూ ఆడకపోవడంతో రచయిగా కొనసాగాడు. ‘గబ్బర్ సింగ్’ అతడికి మంచి పేరు తెచ్చింది. దీంతో హరీష్ శంకర్ ‘రామయ్యా వస్తావయ్యా’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలకు కూడా అవకాశమిచ్చాడు. ఈ సినిమాలు నిర్మించిన దిల్ రాజు కూడా సతీశ్ టాలెంటుకి ఫిదా అయ్యాడు. అతను చెప్పిన ‘శతమానం భవతి’ కథతో సినిమా తీయడానికి ఓకే చెప్పాడు. ఇదీ సతీశ్ వేగేశ్న ప్రస్థానం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News