మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `గాడ్ ఫాదర్` లో విలన్ పాత్రకి సత్యదేవ్ ని ఏరికోరి మరీ ఎంపిక చేసారు. ఆ నమ్మకాన్ని సత్యాదేవ్ నిలబెట్టుకున్నాడు. పాత్రలో నటించాడు అనడం కంటే? జీవించాడు అనే పదం వాడితే సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే? సత్యదేవ్ లో అంత గొప్ప నటుడు ఉన్నాడని ఆ పాత్ర ద్వారా మరోసారి తేటతెల్లమైంది.
తనలో ఆ ప్రతిభను గుర్తించే చిరంజీవి-మోహన్ రాజా అతన్ని ఎంపిక చేసుకున్నారు. ఓ సీన్ లో ఏకంగా చిరంజీవి కళ్లలో కళ్లు పెట్టి మరీ మాట్లాడాడు. ఆ సీన్స్ బాగా పండాయి. అయితే మెగాస్టార్ తో అలాంటి సీన్ చేయాలంటే గట్స్ ఉండాలి. ఆషామాషీ నటుడైతే కుదరదు. కానీ సత్యదేవ్ దాన్ని సాధ్యం చేసి చూపించాడు. దానికి సంబంధంచి కొన్ని టెక్నిక్ లు సైతం ఫాలో అయినట్లు రివీల్ చేసాడు.
చిరంజీవి గారితో సీన్ అనగానే కళ్ల అద్దాలు తీసేని నటించేవాడుట. అలా అద్దాలు లేకపోవడం వల్ల అంత పర్పెక్షన్ గా నటించినట్లు చెప్పుకొచ్చాడు. తనకి ఐ సైట్ ఉండటం ఈ సినిమాకి బాగా కలిసొచ్చిందని నవ్వేసాడు. ఇక ఇదే సినిమాలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ఓ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. చిరుతో పూరి కి ఓ మంచి సీన్ కూడా ఉంది.
అందులో పూరి నటనతో చింపేసాడు. తన ప్రస్టేషన్ అంతా ఆ పాత్రలో చూపించాడు. అయితే చిరు తో సీన్ అనగానే పూరి సైతం కాస్త కంగారు పడ్డాడుట. వెంటనే ఓ అర్ధరాత్రి పూరి సత్యదేవ్ కి ఫోన్ చేసి బాస్ తో నీ సీన్స్ ఎలా చేసావు? ఆయన ముందు ఎలా నటించాలో కాస్త చెప్పు? అంటూ సలహా అడిగారుట. దానికి సత్యదేవ్ అన్నయ్యతో నటించడం చాలా ఈజీ.
పెద్దాయన కళ్లలోకి కళ్లు పెట్టుకుండా ఉంటే చాలు సీన్ పూర్తయిపోతుంది అన్నారుట. అయితే ఆ మరుసటి రోజు పూరి సత్యదేవ్కి మళ్లీ ఫోన్ చేసి ఇచ్చావ్ లే తొక్కలో సహా అంటూ కసుబుస్సు మన్నాడుట. ఆ రకంగా సత్యదేవ్ ని సలహా అడిగి..అతని సలహా పాటించకుండా..తిరిగి మళ్లీ పూరి అతనికే పంచ్ వేసాడు. ఇదంతా సరదగా జరిగిన సంభాషణ అని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకి ఛాయాగ్రణాహకుడిగా పనిచేసిన నిరవ్ షా సత్యదేవ్ కి ఓ మంచి సలహా ఇచ్చారుట. విలన్ గా చాలా చక్కగా నటించావు. ఇలాగే కొనసాగు. ఇలా అయితేనే 100 కోట్లు సంపాదించే నటుడు అవుతావని సలహా ఇచ్చారుట. మొత్తానికి `గాడ్ ఫాదర్` సక్సెస్ సత్యదేవ్ జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.