ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏ మెట్టు మీదున్నాడు?

Update: 2022-09-27 04:11 GMT
సినీప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎద‌గ‌డం అంటే అంత సులువేమీ కాదు. ఫౌండేష‌న్ వేసేందుకే ద‌శాబ్ధం పైగానే వేచి చూడాలి ఇక్క‌డ‌. అంద‌రిలానే తాను కూడా అంతే ఎక్కువ స‌మ‌యం వేచి చూసాడు స‌త్య‌దేవ్. క్యారెక్ట‌ర్ న‌టుడిగా హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. హీరోగా అత‌డు న‌టిస్తున్న సినిమాలు బంప‌ర్ హిట్లు కొట్ట‌క‌పోయినా.. కొన్ని రిలీజ్ గండంలో ఉన్నా కానీ అత‌డు న‌టుడిగా మాత్రం ఫెయిల్ కావ‌డం లేదు. స్టెప్పు స్టెప్పుకి న‌టుడిగా త‌న‌ని తాను మెరుగుప‌రుచుకుంటూ ప‌రిణ‌తి అంటే ఏంటో చూపిస్తున్నాడు.

ముఖ్యంగా అత‌డు 'బ్ల‌ఫ్ మాస్ట‌ర్' చిత్రంలో న‌టించిన తీరుకు న‌భూతోన‌భ‌విష్య‌తి అన్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. నిజానికి సంఘంలో ఇలాంటి బ్ల‌ఫ్ గాళ్లు చాలా మంది ఉంటార‌ని కూడా ఆ సినిమా నీతిని బోధించింది. ఇక‌పోతే స‌త్య‌దేవ్ చాలా ప్ర‌యోగాలు చేసినా కానీ విజ‌యాల్లేక‌పోవ‌డ‌మే అత‌డికి ఉన్న మైన‌స్.

స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో రెండు క్రేజీ చిత్రాల‌తో తెలుగు-హిందీ ఆడియెన్ కి అత‌డు స్ట్రైక్ అవుతున్నాడు. వీటిలో ఒక‌టి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాద‌ర్ కాగా రెండోది బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అక్ష‌య్ కుమార్ తో క‌లిసి న‌టించిన రామ్ సేతు.

ఈ రెండు సినిమాలు తెలుగు- హిందీ ఆడియెన్ ని ట‌చ్ చేయ‌బోతుండ‌డంతో స‌త్య‌దేవ్ కి రెండు చోట్లా పేరొస్తుంద‌ని భావిస్తున్నారు. అక్ష‌య్ రామ్ సేతు కూడా తెలుగులో అనువాద‌మై విడుద‌ల కాబోతుండ‌డం అత‌డికి ప్ల‌స్ కానుంది.

గాడ్ ఫాద‌ర్ లో చిరంజీవితో నువ్వా నేనా? అంటూ పోటీప‌డే విల‌న్ పాత్ర‌లో న‌టించారు స‌త్య‌దేవ్. ఇందులో అత‌డి డైలాగులు పవ‌ర్ ఫుల్ గా ఉంటాయ‌ని టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు రామ‌సేతు నిర్మాణం నేప‌థ్యంలో థ్రిల్ల‌ర్ క‌థ‌నంతో రూపొందిన రామ్ సేతు టీజ‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో కార్తికేయ త‌ర‌హాలో హిట్టు కొడుతుంద‌ని భావిస్తున్నారు. ఇందులో అక్ష‌య్ స‌న్నిహితుడిగా స‌త్య‌దేవ్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌డంతో హిందీ ఆడియెన్ కి అత‌డు క‌నెక్ట‌య్యే ఛాన్సుంది.

తొలి నుంచి రామ్ గోపాల్ వ‌ర్మ కాంపౌండ్ న‌టుడిగా స‌త్య‌దేవ్ కి గుర్తింపు ఉంది. అది అన్నిచోట్లా అత‌డికి క‌లిసొస్తుంది. ఇక న‌టుడిగా విల‌క్ష‌ణ‌త‌తో ఆక‌ట్టుకుంటున్నాడు కాబ‌ట్టి ఇప్ప‌టికి అతడు ఎన్నో మెట్టు మీద ఉన్నాడో చూడాలి. ఆకాశం ఎత్తు ఎదిగే ముందు ఇవ‌న్నీ మామూలే.. మెట్లు ఎన్ని ఎక్కినా త‌ర‌గ‌వు. అయినా ఎక్కుతూనే పోవాలి! ఆ రెండు భారీ చిత్రాల‌తో స‌త్య‌దేవ్ రేంజు మారుతుంద‌నే ఆశిద్దాం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News