కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా గత మూడు నెలలుగా సినిమా థియేటర్లు మూతబడి ఉన్నాయి. దీంతో సమ్మర్ సీజన్ లో రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్సీ ఆఫర్స్ రావడంతో కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. డైరెక్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేస్తున్నారు. మరికొందరు ఫిలిం మేకర్స్ సినిమా హాళ్లలోనే రిలీజ్ చేయాలని డిసైడ్, ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతమతులు ఇచ్చాయి. దీంతో వాయిదా పడిన సినిమాన్నీ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
సినిమా చూడటానికి జనాలు థియేటర్లకు వస్తారా? అనే సందేహాలు ఉన్న నిర్మాతలు ఇంకొన్ని రోజులు వేచి చూద్దాం అనే ఆలోచనతో ఉంటే.. ప్రేక్షకులు కచ్చితంగా వేస్తారనే నమ్మకంతో మరికొందరు నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ చేస్తామంటూ ముందుకు వెళ్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటించిన 'తిమ్మరుసు' చిత్రాన్ని జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అందరి కంటే ముందే ప్రకటించారు. ఇదే క్రమంలో యువ హీరో తేజ సజ్జా నటించిన 'ఇష్క్' మూవీని ఈ నెల 30న థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో సెకండ్ వేవ్ తర్వాత ఒకే రోజు రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ అనివార్యం అయింది.
సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ''తిమ్మరుసు'' చిత్రానికి 'కిర్రాక్ పార్టీ' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. 'అసైన్‌మెంట్ వాలి' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లాయర్ పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై మహేష్ కోనేరు - సృజన్ ఎరబోలు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. మరి సినిమా ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
తేజా సజ్జ నటించిన ''ఇష్క్'' చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజు తెరకెక్కిస్తున్నాడు. 'నాట్ ఏ లవ్ స్టోరీ' అనేది దీనికి ఉపశీర్షిక. ఇందులో తేజ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది. ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఎన్వీ ప్రసాద్ - పారస్ జైన్ - వాకాడ అంజన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'జాంబిరెడ్డి' సినిమాతో సక్సెస్ అందుకున్న తేజ సజ్జ.. 'ఇష్క్' సినిమాతో మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
'తిమ్మరుసు' - 'ఇష్క్' మూవీస్ కు వచ్చే రెస్పాన్స్ ను బట్టి అసలు ఆడియన్స్ సినిమాల్ని చూడటానికి థియేటర్స్ కి వస్తారా లేదా అన్నది తేలిపోతుంది. వీటి రిజల్ట్ ఆధారంగా మరి కొన్ని సినిమాలు రిలీజ్ డేట్లను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించేంత కెపాసిటీ ఈ రెండు సినిమాలకి ఉందా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో జూలై 30న సత్యదేవ్ - తేజ సజ్జ లలో థియేటర్ లో మనుగడ సాధించేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. 'తిమ్మరుసు' వెర్సెస్ 'ఇష్క్' లలో ఎవరు బాక్సాఫీస్ వద్ద గట్టిగా నిలుస్తారో చూడాలి.