ప్రస్తుతం టాలీవుడ్లో మహేష్ బాబు స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ప్రభాస్ రేంజి ఏంటో కూడా అందరికీ తెలిసిందే. ఐతే వీళ్లిద్దరూ హీరోలుగా మారకముందే వాళ్లు ఆ స్థాయికి వస్తారని తాను అంచనా వేశానని అంటున్నాడు వైజాగ్ సత్యానంద్. మహేష్.. ప్రభాస్ ఇద్దరూ నటనలో ఓనమాలు దిద్దుకున్నది ఈయన దగ్గరే. మహేష్.. ప్రభాస్ గొప్ప స్థాయికి వెళ్తారని ముందే అంచనా వేయడమే కాక.. ఆ విషయంలో వారి కుటుంబ సభ్యులకూ చెప్పానని సత్యానంద్ వెల్లడించాడు. అందర్లోకి మహేష్ బాబుకి శిక్షణ ఇవ్వడం తేలికైందని కూడా ఆయన వెల్లడించాడు.
‘‘పవన్ కళ్యాణ్ కు నేను శిక్షణ ఇచ్చిన విషయం తెలుసుకుని రాఘవేంద్రరావు గారు.. అశ్వనీదత్ కు చెప్పి మహేష్ ను నాకు అప్పగించారు. మహేష్ బ్రిలియంట్ స్టూడెంట్. అతడి మెమరీ పవర్ అమోఘం. ఏం చెప్పినా రెస్పాన్స్ చాలా వేగంగా వచ్చేది. క్లాసుల్ని ఎంజాయ్ చేస్తూ.. వెంటనే రెస్పాండ్ అయ్యేవాడు. నాకు చాలా శ్రమ తక్కువైంది. ఒకసారి రెండున్నర పేజీల డైలాగ్ ఇస్తే పది నిమిషాల్లో దాన్ని అప్పగించేశాడు. చైల్డ్ ఆర్టిస్టుగా చేయడం వల్ల చురుగ్గా ఉండేవాడు. ఐతే నటనలో సైంటిఫిక్ ప్రాసెస్ చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు తెలియదు. దీని గురించి అతనికి ఒక సిలబస్ లా చెప్పాను. అతనూ బాగా పట్టుకున్నాడు. మహేష్ భవిష్యత్తు గురించి కృష్ణగారు ఒకసారి అడిగారు. టాప్-3లో ఉంటాడని చెప్పాను. ఇక ప్రభాస్ కూడా బాగా నేర్చుకునేవాడు. ఒకసారి ప్రభాస్ వాళ్ల బావగారు.. అతడి సిస్టర్ నన్ను వాళ్లింటికి భోజనానికి పిలిచారు. మావాడు ఏ స్థాయికి వెళ్తాడని అడిగారు. ఇండస్ట్రీలో టాప్-3 లేదా టాప్-4లో ఒకడిగా ఉంటాడని చెప్పాను. వాళ్లు నమ్మలేదు’’ అని సత్యానంద్ వెల్లడించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/