రజనీకాంత్ ను వృద్ధాశ్రమంలో చేర్చాలంట!

Update: 2016-07-30 05:16 GMT
భారీ అంచనాల నడుమ విడుదలయిన కబాలి సినిమా విడుదలైననాటి నుంచీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సినిమాకి సంబందించి రోజుకో వార్త బయటకువస్తోంది. సినిమా బాగుందా - బాగాలేదా అనే విషయం కాసేపు పక్కనపెడితే.. తాజాగా రజనీపైనా - కబాలి దర్శక నిర్మాతలపైనా ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కబాలి సినిమా చూసి వచ్చిన ఆ యువకుడు నేరుగా చైన్నై నగర పోలీస్ కమీష్నర్ ను ఆశ్రయించాడు. ఆసక్తికరంగా ఉన్న ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

చెన్నై వడపళినికి చెందిన కందస్వామి అనే యువకుడు నగర పోలీస్ కమిషనర్ కు ఒక వినతిపత్రం సమర్పించాడు. ఆ వినతిపత్రంలో అతడు పొందుపరిచిన అంశాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. తాను కాశీ థియేటర్లో రూ.1200 లకు టీకెట్ కొని కబాలి సినిమా చూశానని - ఈ సినిమా చూడాలని నిర్మాత ఎక్కువగా ప్రచారం చేసి ఆసక్తిని రేకెత్తించడమే దీనికి కారణమని మొదలుపెట్టిన ఆ యువకుడు...  66ఏళ్ల సీనియర్ సిటిజన్ (రజనీకాంత్) తో ఫైట్స్ చేయించి నన్ను చిత్రవధ చేశారాని ఆరోపించాడు. ఈ విషయంలో రజనీకాంత్ - దర్శకుడు రంజిత్ లు తనను మోసం చేశారని పేర్కొన్నాడు.

ఇదే సమయంలో రజనీపైనా - తమిళ నిర్మాతల పైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ యువకుడు. తమిళ నిర్మాతల నుంచి రజనీని కాపాడాలని - అనంతరం వృద్ధాశ్రమంలో చేర్పించాలని కోరాడు. ఇటువంటి సీనియర్ సిటిజన్స్ కు తమిళనాడు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తోంది కాబట్టి దయచేసి రజనీని కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చండి అని కంద స్వామి వినతిపత్రం పేర్కొన్నాడు.
Tags:    

Similar News