తెలుగులో ఒక అరుదైన.. ఆసక్తికర సినిమా ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ ఈ బుధవారం విడుదలవుతోంది. తెలుగులో బయోపిక్స్ చాలా చాలా అరుదు. అందులోనూ ఒక నటి కథను సినిమాగా తెరకెక్కించడం అన్నది ఇప్పటిదాకా జరగనే లేదు. ఏదో ఆషామాషీగా కాకుండా ఆ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైజయంతీ మూవీస్ ఎంతో శ్రమకు.. ఖర్చుకు ఓర్చి ఈ చిత్రాన్ని నిర్మించింది. కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. సావిత్రి కథను సినిమాగా చేస్తే ఎవరు చూస్తారు.. అయినా బయోపిక్ తీసే నేర్పు మనవాళ్లకు ఉందా అని సందేహించిన వాళ్లందరూ గత కొన్ని నెలల్లో ఈ చిత్రానికి సంబంధించి ఒక్కొక్కటిగా విడుదలైన ప్రోమోలు చూసి ఆశ్చర్యపోయారు. అబ్బురపడ్డారు. ఈ సినిమాపై ఉన్న సందేహాలన్నీ తొలగిపోయి ఒక గొప్ప సినిమా చూడబోతున్న భావన కలిగింది.
‘మహానటి’లోని కాస్ట్ అండ్ క్రూ.. ఈ చిత్ర ప్రోమోలు చూస్తే ఇది ఒక క్లాసిక్ లాగా నిలిచిపోతుందనే భావన కలుగుతోంది. ‘వైజయంతీ మూవీస్’కు.. ఈ చిత్ర దర్శకుడికి ఇది గొప్ప పేరు తెస్తుందనే అంతా అంచనా వేస్తున్నారు. కానీ కేవలం పేరు మాత్రమే వస్తే సరిపోదు. పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రావాలి. ఆరేడు దశాబ్దాల కిందటి నేపథ్యంలో సినిమాను తెరకెక్కించడమంటే మాటలు కాదు. అందులోనూ సినీ నేపథ్యంలో సినిమా తీయాల్సి ఉండటంతో ఆ వాతావరణాన్ని తెరపై చూపించడానికి చాలా కష్టమే పడింది చిత్ర బృందం. భారీగా ఖర్చు పెట్టి సెట్స్ వేయాల్సి వచ్చింది. ఇక ఈ చిత్రంలో ఎంత భారీ తారాగణం ఉందో తెలిసిందే. ప్రొడక్షన్ కు తోడు వాళ్లందరి పారితోషకాలు కలిపి బడ్జెట్ భారీగానే అయినట్లు సమాచారం. ఐతే ఈ చిత్రాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న వైజయంతీ మూవీస్.. ఏమాత్రం రాజీ లేకుండా ఖర్చు పెట్టింది. ఆ ఖర్చుకు తగ్గట్లు సినిమాకు బిజినెస్ జరగలేదని సమాచారం. ఐతే సినిమాకు మంచి టాక్ వస్తే పరిస్థితి వేరుగా ఉండొచ్చు. అయినప్పటికీ ఈ చిత్రం అసాధారణంగా ఆడితే మొత్తం బడ్జెట్ రికవరీ అవుతుంది. మరి ‘మహానటి’ కేవలం పేరు తేవడంతో సరిపెడుతుందా.. డబ్బులు కూడా తెస్తుందా అన్నది చూడాలి.