మహానటి సావిత్రి జీవిత కథ విడుదలకు త్వరత్వరగా సిద్ధమైపోతోంది. ఆ సినిమాలోని సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయినట్టే కనిపిస్తోంది. సావిత్రి సినిమా వస్తున్న సందర్భంగా ఆమె కూతురు విజయచాముండేశ్వరిని ఓ పాపులర్ పత్రిక ఇంటర్య్వూ చేసింది. అందులో బయట ప్రపంచానికి తెలియని విషయాలను పంచుకుంది సావిత్రి బిడ్డ. సావిత్రికి ఇష్టమైన వంటకమేదో చెప్పింది.
మొదట్లో సావిత్రి బయోపిక్ వస్తోంది అనగానే అందరూ ఏముంటుందిలే ఏడుపులు ట్రాజెడీలు తప్ప అని నిరాశగా మాట్లాడారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌లు ట్రైలర్లు పోస్టర్లు చూశాక ఆ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పలేదు. ఆమె జీవితంలోని ఆనంద క్షణాలను కూడా కంటికి ఇంపుగా తెరకెక్కించారు దర్శకు నాగ అశ్విన్. ముఖ్యంగా ఆమె తన జీవితంలో ప్రేమకు ఇచ్చిన విలువను చూపించబోతున్నారు. అందుకోసం పెద్ద పరిశోధనే చేసినట్టు అర్థమవుతోంది. ఆయనకు ఎక్కువ సహకారం అందించింది సావిత్రి కన్నబిడ్డ విజయ చాముండేశ్వరి. ఆమె చెప్పిన దాని ప్రకారం... సావిత్రి అప్పట్లోనే ఇప్పటి కెఎఫ్ సిలాంటి చికెన్ ను నేర్చుకుని మరీ వండింది. ఆమెకు నాన్ వెజ్ లంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పీతల కూర అదిరిపోయేట్టు వండగలదు.
సావిత్రికి పనివాళ్లను తక్కువ చూడడమంటే అస్సలు ఇష్టం ఉండదు. తన బిడ్డలకు కూడా అదే నూరిపోసింది. వారిని కూడా గౌరవించమని చెప్పేది. పిల్లల చదువులకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది. తన కూతురిని తమిళ సాహిత్యం చదవమని కోరేది. సావిత్రి పిల్లలతో కలిసిపోయి చిన్న పిల్లలా ఆడుకునేది. సావిత్రి కూతురు విజయ చాముండే్శ్వరి తన తల్లి జీవితంపై వచ్చే సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తోంది.