హీరోలతో పోలిస్తే వెండితెరపై హీరోయిన్లకు ఉండే ఇంపార్టెన్స్ తక్కువే. కానీ హీరోలతో సమానంగా.. ఇంకా చెప్పాలంటే వారికంటే ఒకింత ఎక్కువే స్టార్ డమ్ సంపాదించిన హీరోయిన్లు అత్యంత అరుదేనని చెప్పాలి. టాలీవుడ్ వరకు వస్తే తరానికి ఓ నటి మాత్రమే అంతటి ఆదరణ దక్కించుకోగలిగారు. కానీ వెలుగులు పంచిన మేటి తారలంతా అర్ధంతరంగా దూరమైపోవడమే అత్యంత విషాదం.
బ్లాక్ అండ్ వైట్ సినిమాల రోజుల్లో సావిత్రి తిరుగులేని స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోగలిగారు. కళ్లతోనే అభినయించగలిగిన ఓ గొప్ప నటి ఆమె. అందుకే మహానటి అన్న బిరుదు ఆమెకు మాత్రమే దక్కింది. వెండితెరపై మహారాణిలా వెలిగిన సావిత్రి చివరి రోజులు దయనీయంగా సాగాయి. ఆమె కన్నుమూసేసరికి ఆమె వయసు 47 సంవత్సరాలు మాత్రమే. తరవాత తరంలో దేశం మొత్తాన్ని తన అతిలోక సౌందర్యంతో మైమరింపజేసిన నటి శ్రీదేవి. పదహారేళ్ల వయసు నుంచి ఖుదాగవా వరకు ఆమె అందాన్ని ఆరాధించని ప్రేక్షకులు లేరు. ఇంగ్లిష్ వింగ్లిష్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ ప్రతిభావంతమైన నటి హఠాత్తుగా.. అనూహ్యంగా అందరాని లోకాలకు వెళ్లిపోయింది.
నిన్నటి తరంలో సావిత్రి వారసురాలిగా గుర్తింపు తెచ్చుకున్న నటి సౌందర్య. ఆమె సమ్మోహన సౌందర్యం.. అద్భుతమైన అభినయం దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ ను చేశాయి. దశాబ్ద కాలంపైగా ఆమె టాప్ హీరోయిన్ గా కొనసాగింది. కానీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె కూడా హఠాన్మరణం చెందింది. అప్పటికి ఆమె వయసు 34 సంవత్సరాలు మాత్రమే.
సావిత్రి.. శ్రీదేవి.. సౌందర్య ఈ ముగ్గురూ తెలుగు సినిమాకు ఆభరణాల్లాంటి వారు.. తెలుగు సినిమాకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టిన అద్భుతమైన నటీమణులు. తమ నటనతో వెండితెరను సుసంపన్నం చేయగలిగిన వీరు మధ్యలోనే మరలిరాని లోకాలకు వెళ్లిపోవడం మాత్రం తీరనిలోటు. మా కోసం ఇలా తక్కువ కాల్షీట్లు ఇస్తే ఎలాగండీ?