అక్కినేని నాగచైతన్య - నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వం వహించిన సవ్యసాచి నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజవుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని చైతూ కెరీర్ బెస్ట్ గా రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ పై పూర్తి ధీమాను వ్యక్తం చేస్తోంది.
తాజాగా సవ్యసాచి సెన్సార్ రిపోర్ట్ అందింది. ఈ సినిమాకి సెన్సార్ యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సినిమా ఆధ్యంతం ఉత్కంఠ ను పెంచే ఎలిమెంట్ వర్కవుట్ అయిందని తెలుస్తోంది. ముఖ్యంగా మరకతమణి ఎం.ఎం.కీరవాణి ఇచ్చిన రీరికార్డింగ్ అద్భుతంగా కుదిరిందిట. తొలినుంచి చందు మొండేటి - నాగచైతన్య బృందం నమ్మకాన్ని నిలబెడుతూ కీరవాణి తన అనుభవం రంగరించి మాష్టర్ పీస్ అనదగ్గ నేపథ్య సంగీతం ఇచ్చారట.
నేడు సవ్యసాచి కార్యాలయంలో జరిగిన ఇంటర్వ్యూలో చందు మొండేటి సైతం విజయంపై ధీమాను వ్యక్తం చేశారు. కీరవాణి సంగీతం - రీరికార్డింగ్ పై ఎంతో నమ్మకాన్ని వ్యక్తపరిచారు. కథ పరంగా తాను నమ్మిన అంశాన్ని తెరపైకి తేవడంలో సక్సెస్ సాధించానన్న ధీమాను కనబరిచారు. వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అన్న పాయింట్.. ఎడమచేతికి ఉండే ఆ ప్రాబ్లెమ్ ని తనతో పాటు చిత్రయూనిట్ బాగా నమ్మిందని అది వర్కవుటైందని చందు తెలిపారు.