పిక్ టాక్ : మీతో పాడటం.. మీతో డాన్స్‌ ఎప్పటికి మర్చిపోలేను

Update: 2021-07-08 10:30 GMT
బాలీవుడ్‌ లెజెండ్రీ స్టార్‌ దిలీప్ కుమార్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనతో సన్నిహితం ఉన్న బాలీవుడ్‌ ప్రముఖులు మరియు సౌత్‌ ప్రముఖులు ఆ ఫొటోలను షేర్‌ చేసి తమ సంతాపంను తెలియజేశారు. ఈ సందర్బంగా దిలీప్‌ కుమార్‌ కు బంధువు అయ్యే హీరోయిన్‌ సాయేషా సైగల్ ఈ ఫొటోను షేర్‌ చేసింది. నా చిన్నతనంలో ఎక్కువ సమయంను మీతో గడిపే అవకాశం రావడం నేను చేసుకున్న అదృష్టం.

లెజెండ్‌ గా ప్రపంచం పిలిచే మీతో కలిసి గడిపే సమయం నాకు చిన్నప్పుడు వచ్చినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలిని. నేను జీవితంలో మీతో పాడటం.. మీతో డాన్స్ చేయడం వంటిని ఎప్పటికి మర్చీ పోలేను. నా చిన్నతనం నుండే మీ నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. మీరు చనిపోవడం తో ఒక అద్యయం ముగిసింది అంటూ సంతాపం తెలియజేసింది.

సాయేషా సైగల్ షేర్‌ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. దిలీప్‌ కుమార్ ఈమెకు వరుసకు అంకుల్ అవుతారని తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా సాయేషా కుటుంబ సభ్యులకు మరియు దిలీప్ కుమార్ కుటుంబంకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకు చిన్నతనంలో ఎక్కువగా దిలీప్‌ కుమార్‌ తో ఈమెకు గడిపే అవకాశం దక్కింది. ఇక సాయేషా హీరోయిన్‌ గా వరుసగా సినిమాలు చేస్తోంది. ఆర్య ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈమె సినిమాల్లో కనిపిస్తూనే ఉంది. తెలుగు వారికి అక్కినేని వారి ప్రిన్స్ 'అఖిల్‌' సినిమాతో పరిచయం అయ్యింది. ఆ ఒకటి రెండు సినిమాల్లో నటించినా కూడా కమర్షియల్‌ సక్సెస్‌ లను  మాత్రం దక్కించుకోలేక పోయింది.
Tags:    

Similar News