మహర్షి : నడి వేసవిలో పొలంలో పిల్లలా?

Update: 2019-05-14 09:55 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' ఈ నెల 9 వ తారీఖున విడుదల అయిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు రివ్యూస్ యావరేజ్ గానే ఉన్నాయి మౌత్ టాక్ విషయం తీసుకుంటే అది కూడా మిక్స్డ్ టాక్ ఉంది.  అయితే సినిమాలో వ్యవసాయం మన జీవితంలో ఒక భాగమని.. రైతన్నలకు మనం గౌరవం ఇవ్వాలనే సందేశం మాత్రం అందరినీ మెప్పిస్తోంది.

దీంతో  ఇన్ స్పైర్ అయిన కొందరు  వీకెండ్ ఫార్మింగ్ అంటూ ఇప్పటికే పొలం పనులు చేస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. యువకులే కాదు.. కొన్ని స్కూల్స్ కూడా వ్యవసాయంపై పిల్లలకు అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నాయని కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.  మహేష్ సతీమణి నమ్రత కూడా అలాంటి ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేశారు. "మహర్షి ఒక మార్పు.. ఒక ప్రభావం.. ఒక పాఠం.. ఇంకా ఎక్కువ.  ఈ స్పందనకు చాలా సంతోషంగా ఉంది.  అక్కడున్న అందరూ మహర్షులకు హ్యాట్స్ ఆఫ్" క్యాప్షన్ ఇచ్చారు.

ఆ ఫోటోలో స్కూల్ స్టూడెంట్స్ పొలంలో బురదలో దిగి నాట్లు వేస్తూ ముచ్చటగా ఉన్నారు. ఈ ఫోటో పైన ఒక స్కూల్ ఇలా పిల్లలను వ్యవసాయం దిశగా ప్రొత్సహిస్తోందని రాసి ఉంది. ఈ ఫోటోకు.. నమ్రత పోస్ట్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పోస్టుపై కొన్ని విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అసలే ఇది నడి వేసవి. అన్ని స్కూల్స్ కు శెలవులు.  ఈ సమయంలో పిల్లలను పొలం బాట పట్టించిన ఆ స్కూల్ ఎక్కడుందని.. ఆ స్కూల్ పేరు కూడా చెప్తే బాగుంటుందని ప్రశ్నిస్తున్నారు.  హైదరాబాద్ లో కొన్ని కార్పోరేట్ స్కూల్స్ లో ఫార్మింగ్ క్లాసెస్ ఉంటాయి. ఈ ఫోటో అలాంటి క్లాసులు జరిగినప్పటిదే.. పాతదే అయి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.  ఇలాంటి ఫోటోలు తన ఖాతా ద్వరా షేర్ చేసేముందు ఒకసారి నమ్రత గారు చెక్ చేసుకోవడం మంచిందని కొందరు సూచిస్తున్నారు.

అయితే నమ్రత షేర్ చేసిన మరో ఫోటో మాత్రం జెన్యూన్ గానే ఉంది.  ఎందుకంటే అది వికారాబాద్ సమీపంలో ఉన్న ఫామింగ్ స్కూల్ లో పిల్లలు పొలం పనులు చేస్తున్న ఫోటో.  ఫార్మింగ్ స్కూల్ గతంలో కూడా అక్కడ ఉన్నప్పటికీ 'మహర్షి' రిలీజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళే పిల్లల సంఖ్య పెరిగిందట.  పుణ్యం పురుషార్థం లాగా ఈ ఫార్మింగ్.. అటు సమాజానికి మంచి మెసేజ్ ఇటు మహర్షి ప్రమోషన్ కు చక్కగా ఉపయోగ పడుతోంది.
Tags:    

Similar News