సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వం లో రూపొందిన అన్నాత్తే సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ లో తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతులు తీసుకుని మరీ రజినీకాంత్ అన్నాత్తే సినిమా ను ముగించారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా మరింత ఆలస్యం చేయకుండా షూటింగ్ ను ముగించేశారు. రజినీకాంత్ అమెరికా వెళ్లే ప్లాన్ ఉండటం వల్ల అన్నాత్తే ను త్వరగా నే ముగించేశారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమా ఇదే ఏడాది ఆరంభంలోనే విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా వల్ల మొత్తం ప్లాన్ తలకిందులు అయ్యింది.
ఈ మోస్ట్ క్రేజీ అవైటెడ్ మూవీ రిలీజ్ డేట్ పై అదుగో ఇదుగో అంటూ తమిళ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. రజినీకాంత్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఈ సినిమా ను దీపావళికి విడుదల చేసే అవకాశం ఉందని మొదటి నుండి వార్తలు వచ్చాయి. ఇటీవల జోరుగా వినిపించిన వార్తలు నిజమే అన్నట్లుగా రజినీకాంత్ అన్నాత్తే సినిమా ను దీపావళికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
దీపావళికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. అయినా ఇప్పుడే డేట్ ను లాక్ చేశారు. కరోనా కారణంగా పెద్ద చిన్న సినిమాలు అన్ని కూడా పూర్తి అయ్యి విడుదలకు నోచుకోకుండా ఉన్నాయి. అందుకే ఏ సమయంలో అయినా దీపావళికి ఎవరో ఒకరు డేట్ లాక్ చేసుకునే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో అన్నాత్తే మేకర్స్ ముందస్తుగానే డేట్ ను లాక్ చేసుకుని ఉంటారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి టాక్. దీపావళి కి విడుదల కాబోతున్న అన్నాత్తే సినిమా చిత్రీకరణ ముగించిన దర్శకుడు శివ ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.
శివ గత చిత్రాల ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను రజినీకాంత్ అభిమానులు అంటున్నారు. కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరు దక్కించుకున్న శివ ఖచ్చితంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు కూడా సూపర్ హిట్ ఇస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా లో మహానటి కీర్తి సురేష్.. లేడీ సూపర్ స్టార్ నయనతార తో పాటు దృశ్యం హీరోయిన్.. సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇంకా ఈ సినిమా లో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బు కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల కాలంలో సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ లు దక్కించుకున్న దాఖలాలు లేవు. ఇండస్ట్రీ హిట్ కొట్టి రజినీకాంత్ కు చాలా ఏళ్లు అయ్యింది.
ఈ సినిమా తో ఆయన సక్సెస్ ను దక్కించుకుంటాడని.. అది కూడా ఇండస్ట్రీ హిట్ ను ఆయన దక్కించుకుంటాడనే నమ్మకం ను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా లో ఉన్న హీరోయిన్స్ కీర్తి సురేష్ మరియు లేడీ సూపర్ స్టార్ నయనతార లకు సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. కనుక ఈ సినిమా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా మంచి వసూళ్లను రాబట్టడం ఖాయం అంటూ మేకర్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఖచ్చితంగా 200 కోట్లకు మించి అవుతుందని అంటున్నారు. మరి వసూళ్లు అంతకు మించి వసూళ్లు అవుతాయా అనేది చూడాలి. నాలుగు నెలలు ఉండగానే రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించడంతో ఇప్పటి నుండే అభిమానుల ఎదురు చూపులు మరియు కౌంట్ డౌన్ ను ప్రారంభించారు.