#గుస‌గుస‌.. తేజ్ `రిప‌బ్లిక్` రిలీజ్ వాయిదా?

Update: 2021-09-15 09:40 GMT
దురదృష్టవశాత్తు బైక్ ప్రమాదం జరగకపోతే సాయి ధరమ్ తేజ్ తన  రిపబ్లిక్‌ను ఇప్పుడు ప్రచారం చేసుకునేవాడు. యువ ప్రతిభావంతుడు ప్రస్తుతం ప్రమాదానికి గురై గాయాల నుండి కోలుకుంటున్నాడు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ దృష్ట్యా రిపబ్లిక్ మేకర్స్ సినిమాను వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా `రిపబ్లిక్` ను ప్రమోట్ చేయడం ఆచరణాత్మకంగా అసాధ్యం. ఇది అక్టోబర్ 1 న విడుదల కావాల్సి ఉన్నా... నిర్మాతలు వాయిదా వేయాలని భావిస్తున్న‌ట్టు క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సీరియ‌స్ ఇంటెన్స్ మూవీ..?

మెగా మేన‌ల్లుడు సాయి తేజ్ క‌థానాయ‌కుడిగా దేవ‌క‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో `రిప‌బ్లిక్`  ప్ర‌స్థానం త‌ర‌హా ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని ప్ర‌చార‌మ‌వుతోంది. స‌మాజాన్ని.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేలా సినిమా కంటెంట్ ని ఎలివేట్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఆద్యంతం ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌..క‌థ‌నాల‌తో దేవాక‌ట్టా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సాయిధ‌ర‌మ్ కెరీర్ లో చ‌క్క‌ని సందేశాత్మ‌క చిత్రంగా నిలిస్తుంద‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది.  `ప్ర‌స్థానం`.. `ఆటో న‌గ‌ర్ సూర్య` చిత్రాల త‌ర‌హాలోనే రిప‌బ్లిక్ లోనూ  బ‌ల‌మైన సంభాష‌ణ‌ల‌తో ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా కనిపిస్తోంది. స్క్రిప్ట్ ని మించి దేవ‌క‌ట్టా అద్భుత‌మైన డైలాగులు రాస్తార‌ని ఇంత‌కుముందే ప్రూవైంది. రిప‌బ్లిక్ లోనూ అలాంటి ప‌దునైనా డైలాగుల‌కు కొద‌వుండ‌ద‌ని తెలుస్తోంది. ఇందులో తెలుగమ్మాయి ఐశ్వ‌ర్యా రాజేష్ .. డేరింగ్ గాళ్ మైరా హాన్స‌న్ అనే పాత్ర‌లో న‌టించింది. `ఉయ్ ఫాల్... ఉయ్ బ్రేక్.. ఉయ్ ఫెయిల్.. బ‌ట్ దెన్ ఉయ్ రెయిజ్ .. ఉయ్ హిల్.. ఉయ్ ఓవ‌ర్ క‌మ్!! అంటూ  దేవా క‌ట్టా త‌న‌దైన శైలిలో  డిజైన్ చేయ‌డం ఆస‌క్తికరం.

ప్ర‌జాస్వామ్యంలో మూడు స్థంభాలుగా నిలిచే శాస‌న‌.. కార్య‌నిర్వాహాక.. న్యాయ వ్య‌వ‌స్థ అంశాల్ని ప్ర‌ధానంగా హైలైట్ చేస్తున్న‌ట్లు యూనిట్ వ‌ర్గాలు రివీల్ చేసాయి. ఇందులో జ‌గ‌ప‌తిబాబు..ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌థ‌ను న‌డిపించ‌డంలో ఈ పాత్ర‌లు ప్ర‌ధానమ‌ని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ స‌హ‌కారంతో జెబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై జె భ‌గ‌వాన్.. జె పుల్లారావు నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.
Tags:    

Similar News