హీరోలను పరిచయం చేయడంలో.. పూరీ జగన్నాథ్ కి మించిన దర్శకుడు లేడని చెప్పేందుకు సందేహం అక్కర్లేదు. అయితే.. హీరోయిన్స్ ని ఐటెం భామలను తీసుకురావడంలో కూడా పూరీకి చాలా ట్యాలెంట్ ఉంది. అసలు లాంఛింగ్ ల లెక్క ప్రకారం చూసుకుంటే.. పూరీ హీరోల కంటే హీరోయిన్సే ఎక్కువ మంది ఉంటారు.
తన తొలి సినిమా బద్రిలో అమీషా పటేల్ తో మొదలుపెట్టి ఈడియట్ తో రక్షిత.. తర్వాత నీలాంబరి, తను రాయ్, హన్సిక, సమీక్ష, అనుష్కా శెట్టి, అయేషా టకియా.. ఇలా పూరీ లాంఛ్ చేసిన హీరోయిన్స్ సంఖ్య చాలానే ఉంటుంది. రీసెంట్ గా అయితే లోఫర్ దిశా పటానీని కూడా పట్టుకొచ్చాడు పూరీ. అయితే పూరీ పరిచయం చేసిన వాళ్లలో చాలామంది ఫేడవుట్ అయిపోయారు. అందరిలోకూ టాప్ రేంజ్ లో ఉన్నది మాత్రం ఒక్క అనుష్క మాత్రమే.
సూపర్ మూవీతో అయేషా టకియా - అనుష్కలను ఇంట్రడ్యూస్ చేస్తే.. ఇందులో స్వీటిది సెకండ్ హీరోయిన్ పాత్ర. మెయిన్ హీరోయిన్స్ లో ఎవరూ టాప్ రేంజ్ కి చేరకపోయినా.. సెకండ్ హీరోయిన్ గా వచ్చి సత్తా చాటుతోంది స్వీటీ. అంటే పూరీ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవడమే బెస్ట్ ఏమో...