హారర్ జోనర్ సినిమాల ట్రెండ్ నడుస్తోందిప్పుడు. వరుసగా తమిళ్ నుంచి హారర్ సినిమాలు రిలీజై మన బాక్సాఫీస్ ని కొల్లగొడుతున్నాయి. తెలుగులో వచ్చిన స్ర్టెయిట్ సినిమా లు ప్రేమకథా చిత్రమ్ - గీతాంజలి పెద్ద విజయం సాధించాయి. ఇవన్నీ తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి భారీ లాభాల్ని తెచ్చాయి. గీతాంజలి కేవలం 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి అసాధారణ విజయం సాధించింది.
ఇక ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ రాజ్ కిరణ్ స్వాతి కథానాయికగా త్రిపుర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ పరంగా కాస్ట్ లీ అని చెబుతున్నారు. ఇప్పటికే 5కోట్లు ఖర్చు చేశారట. క్వాలిటీతో తీశారని చెబుతున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తం స్వాతిని నమ్మి పెట్టుబడిగా పెట్టారంటే కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంజలి ని నమ్మి గీతాంజలికి 2కోట్లు పెట్టారు. అంజలి తెలుగు - తమిళ్ లో పాపులర్ హీరోయిన్ కాబట్టి అది వర్కవుటైంది. ఇప్పుడు స్వాతిని నమ్మినందుకు ఇంత బడ్జెట్ ఎలా రికవర్ చేస్తారు? అన్న ప్రశ్న తలెత్తింది.
అయితే స్వాతి కి కూడా తెలుగుతో పాటు తమిళ్ - మలయాళంలో మార్కెట్ ఉంది. అందుకే ఈ సినిమాని తెలుగు - తమిళ్ - మలయాళంలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయాలన్నది ప్లాన్. త్రిపుర నాలుగు భాషల్లో రిలీజవుతుంది. అంటే నాలుగు భాషల్లో శాటిలైట్ అమ్ముకున్నా పెట్టుబడులు తిరిగి వచ్చేస్తాయన్నది ప్లాన్. అదన్నమాట స్వాతి చుట్టూ ఉన్న సీక్రెట్. ఐడియా వర్కువుటైతే బాగానే ఉంటుంది. సినిమాలో విషయం ఉంటే ఏదైనా సాధ్యమే.