సోషల్ మీడియాలో ఈమద్య మార్ఫింగ్ మరీ ఎక్కువ అవుతుంది. ఇది నిజమా అబద్దమా అన్నట్లుగా ఉండి ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నట్లుగా కొన్ని మార్ఫింగ్ ఫొటోలు ఉంటున్నాయి. కొన్ని రోజుల క్రితం అనసూయ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో స్వయంగా మె రంగంలోకి దిగి మహా ప్రభో అది నా మార్ఫింగ్ ఫొటో ఇది ఒరిజినల్ ఫొటో అంటూ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పవన్ ఫొటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ చేతిపై ఏపీ సీఎం అని టాటూ ఉన్నట్లుగా ఆ ఫొటోలో ఉంది. చూడగానే అది నిజమైన టాటూనేమో అన్నట్లుగా ఉంది. పవన్ ఏపీ సీఎం కావాలని ఇలా టాటూ వేయించుకున్నాడా అనుకుంటారు. కాని అసలు విషయం ఏంటీ అంటే అది మార్ఫింగ్ ఫొటో. కొందరు నెటిజన్స్ ఆ ఫొటోను వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటో నిజం కాదని.. మార్ఫింగ్ ఫొటో అంటూ పవన్ ఫ్యాన్స్ కొందరు ప్రచారం చేస్తున్నారు.
మొత్తానికి మార్ఫింగ్ ఫొటో అయినా కూడా సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ప్రత్యర్థి వర్గం వారు ఎవరో ఇలా చేసి ఉంటారని.. యాంటీ పవన్ ఫ్యాన్స్ పని అంటూ పవన్ ఫ్యాన్స్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎక్కడకు వెళ్తుందో చూడాలి.