సోషల్ మీడియాలో జిమ్..యోగా వీడియోలతో తరచూ అభిమానులకు టచ్ లో ఉండే శిల్పాశెట్టి కొద్ది రోజులుగా డీయాక్టివేట్ అయిన సంగతి తెలిసిందే. భర్త రాజ్ కుంద్రా పై లైంగిక ఆరోపణల కేసుల్లో ఇరుక్కోవడంతో శిల్పా శెట్టి దానినుంచి బయటపడేందుకు శిల్పా శెట్టి ఇతర వ్యాపకాలతో బిజీ అయ్యారు. ఈ కేసులో శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల నుంచి పిలుపు వెళ్లగానే తక్షణం స్టేషన్ లో ఉండాలనే సీరియస్ హెచ్చరికలతో ఆమె కూడా డిస్టర్బ్ అయ్యారు. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి అభిమానులకు టచ్ లేకుండా పోయింది. కేవలం జాతీయ మీడియా హెడ్ లైన్ లోనే శిల్పాశెట్టి కుటుంబమంతా హైలైట్ అవుతోంది.
అయితే కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు శిల్పాశెట్టి మునుపి మోడ్ లోకి వచ్చేసింది. శిల్పాశెట్టి చీర కట్టిన ఓ కొత్త పోటోని ఇన్ స్టాలో అభిమానులతో పంచుకుంది. ఎర్రంచు పూల చీర... కాంబినేషన్ జాకెట్ ధరించిన ఓ కొత్త ఫోటోలో యోగా టీచర్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మెరిసిపోతున్న కేశాలంకరణ.. మెడలో ఖరీదైన నక్లెస్ తో కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ కూడా చేసింది. ``ఓ మహిళ ఎదగాలని నిర్ణయించుకోవడం అనేది చాలా శక్తివంతమైన ఆలోచన.. దాన్ని మించిన శక్తి మరొకటి లేదు`` అని తెలిపింది. అయితే రాఖీ వేళ ఈ ట్వీట్ పలురకాల సందేహాలకు దారి తీస్తోంది.
ఒక మహిళ గురించి ఎప్పుడూ ఇలాంటి ఆసక్తికర ట్వీట్ శిల్పా శెట్టి చేయలేదు. చీరలో ఉన్న గొప్పదనం గురించి మహిళని ఉద్దేశించి ఇలా స్పందించడం యాథృచ్ఛికమా? లేక మహిళగా ఇకపై ఎవరితోనూ పని లేకుండా ఎదగాలన్న కసి పట్టుదలను ఉద్దేశించి నిజంగా ఇలా స్పందించిందా? అన్న సందేహాల్ని నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు. భర్త రాజ్ కుంద్రా బాలీవుడ్ లో పలువురు నటీమణుల్ని బలాత్కారం చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శిల్పా శెట్టి ట్వీట్ చాలా అసంబద్ధమైన అనుమానాలకు దారి తీస్తోంది. ఇకపై తనకు తాను ఇండివిడ్యువల్ గా ఎవరిపైనా ఆధారపడకుండా... ఎదిగే ఆలోచనతో ఈ నిర్ణయాన్ని ప్రకటించారంటూ చాలామంది సందేహిస్తున్నారు.