విశ్వక్ సేన్ లో నన్ను చూస్తున్నా : బాలకృష్ణ

Update: 2022-11-19 04:38 GMT
యువ హీరో విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో నటిస్తూ తనే డైరెక్ట్ చేసిన సినిమా దాస్ కా దం కి.. సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి నట సింహం బాలకృష్ణ అటెండ్ అయ్యారు. రీసెంట్ గానే అన్ స్టాపబుల్ షోలో విశ్వక్ సేన్ తో చిట్ చాట్ చేసిన బాలయ్య అతని సినిమా ప్రమోషన్స్ కి వచ్చారు.

బాలకృష్ణ లో ఈ మార్పు నందమూరి ఫ్యాన్స్ కి మాత్రమే కాదు తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తుంది. ధమ్కీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య తన ఎనర్జిటిక్ స్పీచ్ ఇచ్చారు. సినిమా ట్రైలర్ బాగుందని. ఇలాంటివి చూసినప్పుడు తను కూడా ఇలాంటి సినిమాలు చేయాలని ఉంటుందని అన్నారు. కానీ ఫ్యాన్స్ ఒప్పుకోరని చెప్పారు.

విశ్వక్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. తనని చూస్తుంటే నన్ను చూసుకున్నట్టే ఉంది. అతనికి ఈ సినిమా మంచి విజయం దక్కాలని కోరుతున్నా అని అన్నారు బాలకృష్ణ. అంతేకాదు విశ్వక్ ని ఎఫ్.ఎఫ్ అని సంభోధిస్తూ అదే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండు తనలో ఉంటాయని చెప్పాడు.

హీరోగా చేస్తూ డైరెక్షన్ చేయడం చాలా కష్టమని కానీ విశ్వక్ సేన్ ఆ విషయంలో తన ప్రతిభ చాటుతున్నాడని అన్నారు. తను కూడా డైరక్షన్ చేద్దామని నర్తనశాల మొదలు పెట్టాను కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే నెక్స్ట్ ఇయర్ ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమా చేస్తానని అన్నారు బాలయ్య.

నటన అంటే కేవలం డ్యాన్సులు, ఫైట్స్ మాత్రమే కాదని.. పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలని. ఇప్పటి యువ హీరోలంతా బాగా కష్టపడుతున్నారని అన్నారు బాలయ్య. ఇక తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు ధమ్కీ సినిమాని కూడా పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు బాలయ్య. ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ కి కూడా తాను అతిథిగా వస్తానని అన్నారు.

అంతకుముందు సినిమా వేడుకలకు పెద్దగా రాని బాలకృష్ణ ఈమధ్య తరచు ఇలాంటి వేడుకలకు వస్తున్నారు. రీసెంట్ గా అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు బాలయ్య బాబు. ఇప్పుడు విశ్వక్ సేన్ సినిమా ట్రైలర్ ఈవెంట్ కి ఆయన అతిథిగా వచ్చి అలరించారు. బాలకృష్ణలోని ఈ మార్పు ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View

Tags:    

Similar News