శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న రణరంగం మొదటి ఆడియో సింగల్ ఇందాకా విడుదల చేశారు. సీతా కల్యాణ వైభోగమే అంటూ సాగే ఈ స్వీట్ మెలోడీ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో మొదలై మెల్లగా దాంపత్య జీవితానికి సంబందించిన సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించింది. బాలాజీ సాహిత్యం అందించగా శ్రీహరి కె గాత్రం చాలా మధురంగా ఉంది. ఎక్కడా లయ తప్పకుండా క్రమ పద్ధతిలో ట్యూన్ చేసిన విధానం దాన్ని ఒన్ చేసుకుని సింగర్ పాడిన వైనం ఆకట్టుకునేలా ఉంది.
ప్రశాంత్ పిళ్ళై సంగీతం ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. లిరికల్ వీడియోలో కొన్ని విజువల్స్ రివీల్ చేశారు. ఇది శర్వానంద్ కళ్యాణి ప్రియదర్శన్ ల పెళ్లి థీమ్ లో వస్తుంది. కథ ప్రకారం శర్వా పాత్ర 90 దశకం నాటి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తుంది. అప్పటి తన జీవిత భాగస్వామినే కళ్యాణి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇతర పాత్రలను చూపకుండా లీడ్ పెయిర్ ని మాత్రమే హై లైట్ చేయడం బాగుంది.
పెళ్లి మండపంలో ఇద్దరు కూర్చుని సంబరంగా ఆనందాన్ని వ్యక్తపరచడం ఆ తర్వాత జంట జీవితంలో ఒక్కటిగా కలిసి మెలిసి అన్యోన్యంతో ఉండగా వాటినే పదాల రూపంలో పాటలో వినిపించడం బాగా కుదిరింది. రణరంగం టైటిల్ లో ఉన్న రఫ్ నెస్ కి భిన్నంగా ఎమోషనల్ సాంగ్ కి బదులు ఇలాంటి మెలోడీని రిలీజ్ చేయడం విశేషం. సితార బ్యానర్ పై రూపొందిన రణరంగం ఆగస్ట్ 2న విడుదల కానుంది.
Full View