'అందాల రాక్షసి' వంటి మనసుకు హత్తుకునే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హను రాఘవపూడి. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించిన టాలెంటెడ్ డైరెక్టర్.. ఆ తర్వాత 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రంతో వెంటనే మరో హిట్ అందుకొని క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. అయితే బ్యాక్ టూ బ్యాక్ రెండు ప్లాప్స్ పలకరించడంతో ప్లాప్ దర్శకుడు అనే ముద్ర పడిపోయింది.
అక్కినేని అఖిల్ హీరోగా హను రాఘవపూడి ఓ సినిమా ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పక్కకెళ్లి నితిన్ హీరోగా 'లై' సినిమా పట్టాలెక్కింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఎన్నో అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత శర్వానంద్ తో చేసిన 'పడి పడి లేచె మనసు' కూడా నిరాశ పరిచింది.
2018 నుంచి మరో సినిమాని డైరెక్ట్ చేయని హను.. 'మహానటి' వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాని నిర్మించిన స్వప్న సినిమా బ్యానర్ లో వర్క్ చేసే అవకాశం అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా ''సీతా రామం'' చిత్రాన్ని తెరకెక్కించారు.
వైజయంతీ మూవీస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాకి ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ట్యాగ్ లైన్. ఇందులో దుల్కర్ సరసన మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించగా.. సుమంత్ - గౌతమ్ మీనన్ - ప్రకాష్ రాజ్ - తరుణ్ భాస్కర్ - భూమిక - సచిన్ ఖేడేకర్ - మురళీ శర్మ - వెన్నెల కిషోర్ - జిషు ఇతర పాత్రల్లో నటించారు.
'సీతా రామం' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విజువల్స్ మరియు మ్యూజిక్ స్పెషల్ గా నిలిచాయి.
1965 యుద్ధం నేపథ్యంలో ఓ అందమైన ప్రేమ కథను 'సీతా రామం' సినిమాలో ఆవిష్కరించబోతున్నారని తెలుస్తోంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. హను లవ్ స్టోరీని బాగా డీల్ చేస్తారనే పేరుంది. ఇప్పుడు ఈ సినిమాలోనూ ఓ మ్యాజికల్ లవ్ స్టొరీని చెప్పబోతున్నాడని అర్థమైంది. ఈసారి దర్శకుడు సాలిడ్ హిట్ కొడతాడని ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ - స్టార్ క్యాస్టింగ్ కూడా హను రాఘవపూడి సక్సెస్ కు హెల్ప్ అవుతాయని అంటున్నారు. ఇప్పటికే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. టాలెంట్ ఉన్నా సక్సెస్ లేని దర్శకుడిగా హను పై ముద్ర పడిపోయింది. మరి 'సీతా రామం' సినిమా అతన్ని సక్సెస్ ట్రాక్ రెక్కించి.. ఇండస్ట్రీలో నిలబెడుతుందేమో చూడాలి.