వరుణ్ తేజ్- సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఫిదా మూవీ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫోకస్ అంతా శేఖర్ కమ్ముల మీదనే ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తన స్టామినాకు తగిన సినిమాను ఈయన డెలివర్ చేయలేదు.
ఈయన గత కొన్ని చిత్రాలు నిరుత్సాహపరిచినా.. శేఖర్ కమ్ములపై ఆడియన్స్ లో చాలానే హోప్స్ ఉన్నాయి. ఆనంద్.. హ్యాపీడేస్ లాంటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేయగలడనే విశ్వాసం ఇండస్ట్రీ తో పాటు.. ఇటు ప్రేక్షకుల్లో కూడా ఉంది. అయితే.. శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రాల్లో మంచి బజ్ క్రియేట్ చేసి.. చివరకు నిరుత్సాహపరిచిన మూవీ లీడర్. సినిమా పరంగా బాగుందని అందరూ చెప్పినా.. కమర్షియల్ గా నిలబడలేకపోయింది. 'లీడర్ రిజల్ట్ విషయంలో ఇప్పటికీ బాధ పడుతుంటా. అద్భుతంగా వచ్చిందని నేను భావిస్తే.. నా అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. చాలా మంది మంచి సినిమా అని చెప్పారు. కానీ రిలీజ్ తర్వాత అంతగా జనాలను మెప్పించలేకపోయింది' అన్నాడు శేఖర్ కమ్ముల.
అనామిక చిత్రం కూడా ఫెయిల్ అయినా.. దాని గురించి అంతగా బాధ పడలేదంటున్నాడు ఈ దర్శకుడు. అసలు ఈ సినిమా వచ్చి వెళ్లిన సంగతే చాలామందికి తెలియదని.. ఒప్పుకోవడం విశేషం.