శేఖర్ కమ్ముల పేరు వినగానే పలు క్లాసిక్స్ గుర్తుకొస్తాయి. హ్యాపీడేస్.. గోదావరి.. ఫిదా లాంటి హిట్ చిత్రాలు స్ఫురణకు వస్తాయి. ఆ సినిమాల్లో సెన్సిబిలిటీస్ తలంపుకొస్తాయి. టాలీవుడ్ లో కొత్త హీరోల్ని తయారు చేసే అత్యంత ప్రభావవంతమైన దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆయన ఒక్కో సినిమా సెలక్షన్ కే చాలా సమయం తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. కంఫర్ట్ కోసం సొంత బ్యానర్ అమిగోస్ లోనే సినిమాలు తీయడం ఆయన పద్ధతి. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కమ్ముల ఓ కొత్త సినిమాని ప్రారంభించేందుకు ఎంతో సమయం తీసుకున్నారు. 2018 చివరిలో కొత్త కుర్రాళ్లతో సినిమా ప్రారంభించారు. అయితే కమ్ముల సినిమాకి సంబంధించి ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ అందలేదు. అసలింతకీ కమ్ముల సినిమా సమాచారం ఏంటి? అని ఆరాతీస్తే..
ప్రస్తుతం కమ్ముల తన సినిమా షూటింగ్ కోసం దుబాయ్ వెళుతున్నారని తెలుస్తోంది. జూన్ తొలి వారం నుంచి అక్కడ ఖరీదైన ఎగ్జోటిక్ లొకేషన్లలో షూటింగ్ చేస్తారట. అంతా నూతన నటీనటులతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఎప్పటిలానే అందరికీ నటనపరంగా ప్రీప్రిపరేషన్ చేశారని తెలుస్తోంది. ఏషియన్ సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచి దుబాయ్ లోనే చిత్రయూనిట్ బిజీగా ఉంటుందట. అక్కడ అరుదైన లొకేషన్లలో కీ సీన్స్ కి ప్లాన్ చేశారు. అటుపై హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుందని చెబుతున్నారు.
కమ్ముల హీరో అనగానే ఒక ప్రత్యేకమైన ఆహార్యం ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. తాను ఎంచుకున్న రొమాంటిక్ లవ్ స్టోరీకి కొత్త కుర్రాళ్లు అయితేనే సూటవుతారు కాబట్టి ఈసారి కొత్త కుర్రాడినే ఎంచుకున్నారు. ఓ డిస్ట్రిబ్యూటర్ కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్నారన్న ముచ్చటా సాగుతోంది. కథానాయిక ఎవరు? అంటే.. అమృత అయ్యర్ అనే కన్నడ నాయిక పేరు అప్పట్లో వినిపించింది. ఈ అమ్మడు విజయ్ ఆంటోని `కాళి` చిత్రంలో నటించిందని చెప్పుకున్నారు. హీరో సహా ఇతర కాస్టింగ్ అంతా కొత్త వాళ్లే నటిస్తున్నారన్నది తాజా అప్ డేట్. తాజా షెడ్యూల్ ఎన్నవది.. ఇదే రెగ్యులర్ చిత్రీకరణ ఆరంభమా? అన్నదాంట్లో కొంత క్లారిటీ మిస్సయ్యింది. సినిమా అంతా పూర్తయ్యాక కానీ ప్రచారానికి దిగని కమ్ముల ఈసారి కూడా అదే పంథాను అనుసరిస్తుండడంతో ఇప్పటివరకూ సరైన ఇన్ఫో లేదు. అధికారికంగా కమ్ములనే ప్రకటిస్తారేమో చూడాలి.