నిన్న హఠాత్తుగా నాగ చైతన్య శేఖర్ కమ్ముల కాంబో సినిమా అనౌన్స్ మెంట్ విని అభిమానులే ఆశ్చర్యపోయారు. కారణం ఇంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ఎవరూ ఊహించనిది. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎందరు క్యూలో ఉన్నా అందరిని కాదని కొత్త వాళ్ళతో ఇంకో లవ్ స్టోరీ మొదలుపెట్టిన శేఖర్ కమ్ముల ఇప్పటిదాకా తీసిన రషెస్ సంతృప్తికరంగా లేకపోవడంతో నిర్మాత సునీల్ నారంగ్ ని ఒప్పించి దానికి ప్యాక్ అప్ చెప్పేశారు.
అప్పటికే బడ్జెట్ 5 కోట్ల దాకా ఖర్చయ్యిందట. అయితే దీన్ని ఎలా భర్తీ చేయాలని ఆలోచించిన శేఖర్ కమ్ముల తనకోసమే వెయిట్ చేస్తున్న చైతుని కలవడం ఓ స్టోరీ చెబితే ఓకే అయిపోవడం చకచకా జరిగిపోయాయి. తనకు టాలీవుడ్ లో లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ అడిగితే సాయి పల్లవి వద్దు అంటుందా. సో ఆ రకంగా పర్ఫెక్ట్ కాంబో రెడీ అయిపోయింది
ఇప్పుడు నిర్మాత సునీల్ నారంగ్ కూడా హ్యాపీనే. శేఖర్ కమ్ముల ఎంత పెద్ద స్టార్ తో తీసినా ఖర్చు లిమిట్స్ దాటించడు. ఎలాగూ చైతు సాయి పల్లవిల జంటకు ఉన్న మార్కెట్ దృష్ట్యా దాన్ని ఇప్పుడు తీయబోయే సినిమా ద్వారా ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. ఓవర్సీస్ లో శేఖర్ కమ్ములకున్న మార్కెట్ దృష్ట్యా అనుకున్న దాని కన్నా ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ ఆలోచించే ఫైనల్ గా ఈ నిర్ణయం తీసుకున్నారు. హ్యాపీ డేస్ తరహాలో తమకు పెద్ద బ్రేక్ అవుతుందని ఆశించిన ఆగిపోయిన స్టార్ క్యాస్ట్ తో శేఖర్ కమ్ముల ఫ్యూచర్ లో ఇంకో సినిమా ఏదైనా తీస్తాడేమో వేచి చూడాలి