ఫిదా మరియు లవ్ స్టోరీ సినిమాలతో ప్రేక్షకులను ఫిదా చేసి సక్సెస్ లను దక్కించుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఏం చిత్రం చేస్తున్నాడంటే ఆయన అభిమానులు మాత్రమే కాకుండా ఎవరు కూడా వెంటనే సమాధానం చెప్పడానికి లేదు. కొన్ని నెలల క్రితం ధనుష్ తో సినిమా అయితే ప్రకటించారు కానీ అది పట్టాలెక్కలేదు.. క్యాన్సిల్ అయినట్లుగా ఉంది.. తదుపరి సినిమా ను ప్రకటించే అవకాశం ఉందని చాలా మంది అనుకుంటున్నారు.
అసలు విషయం ఏంటీ అంటే శేఖర్ కమ్ముల మరియు ధనుష్ యొక్క ప్రాజెక్ట్ అటకెక్కలేదు.. ఏటో వెళ్లి పోలేదు. ఇద్దరి మధ్య ఉంది.. ఇంకా చర్చల దశలో ఉంది. ప్రస్తుతం ధనుష్ చేస్తున్న తెలుగు.. తమిళ.. హిందీ.. ఇంగ్లీష్ ప్రాజెక్ట్ లు పూర్తి అయిన తర్వాత కమ్ముల ప్రాజెక్ట్ మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన ఈ ఏడాది చివర్లో రాబోతుంది. ఒక భారీ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది. 1950 లో ఆంధ్రా మరియు తమిళనాడు మధ్య ఉన్న సంబంధాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
తమిళనాడులో ఉండే తెలుగు కుర్రాడి పాత్రలో ధనుష్ ను దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. విభిన్నమైన నేపథ్యం అవ్వడంతో పాటు భారీ పీరియాడిక్ సినిమా అవ్వడం వల్ల కాస్త ఎక్కువ సమయం మరియు ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. త్వరలోనే అధికారికంగా ధనుష్ మరియు కమ్ముల ప్రాజెక్ట్ మళ్లీ అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది శేఖర్ కమ్ముల ప్యాన్స్ నిజంగా ఫిదా అయ్యే వార్త కదా..!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.