కొత్త హీరోకే ఫిక్స్‌ అయిన కమ్ముల

Update: 2018-11-12 11:20 GMT
‘ఫిదా’ చిత్రం విడుదలై సంవత్సరంనర దాటింది. అయినా శేఖర్‌ కమ్ముల సినిమాను ఇంకా పట్టాలెక్కించలేదు. ఇప్పుడే కాదు శేఖర్‌ కమ్ముల సినిమా సినిమాకు చాలా గ్యాప్‌ ఉంటూనే వస్తోంది. ప్రతి సినిమాను చాలా విభిన్నంగా, ప్రత్యేకంగా, కొత్తగా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో సినిమా సినిమాకు శేఖర్‌ కమ్ముల గ్యాప్‌ తీసుకుంటూ ఉంటాడు. ఫిదా చిత్రం తర్వాత ఎన్నో కథలు అనుకుని చివరకు ఒక కథకు ఫిక్స్‌ అయిన శేఖర్‌ కమ్ముల కొత్త హీరోతో సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు. తన సినిమాలో హీరో పాత్ర కోసం ఎంతో మందిని పరిశ్రీలించిన శేఖర్‌ కమ్ముల చివరకు ప్రముఖ నిర్మాత దానయ్య తనయుడిని మరియు ఒక కొత్త కుర్రాడిని షార్ట్‌ లిస్ట్‌ చేయడం జరిగింది.

వీరిద్దరికి పలు టెస్టులు పెట్టిన తర్వాత తాను అనుకున్న కథకు కొత్త కుర్రాడు అయితేనే సరైన న్యాయం చేయగలడని నిర్ణయించుకుని ఆ కుర్రాడికి శేఖర్‌ కమ్ముల ఫిక్స్‌ అయినట్లుగా తెలుస్తోంది. నేడు ఉదయం ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా కూడా హీరోకు సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు. హీరో ఎవరు అనే విషయంను శేఖర్‌ కమ్ముల ఇప్పుడే రివీల్‌ చేయాలని భావించడం లేదని సమాచానం.

ప్రస్తుతం హీరోయిన్‌ కోసం శేఖర్‌ కమ్ముల అన్వేషణ సాగుతుందని తెలుస్తోంది. ‘ఫిదా’లో సాయి పల్లవి పాత్రల ఈ చిత్రంలో కూడా హీరోయిన్‌ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. అందుకే మంచి నటన ప్రతిభ ఉన్న అమ్మాయిని ఎంపిక చేయాలని శేఖర్‌ కమ్ముల భావిస్తున్నాడు. శేఖర్‌ కమ్ముల గత చిత్రాల్లో కూడా హీరోయిన్స్‌ కు మంచి ప్రాముఖ్యత ఇచ్చాడు. అందుకే ఈ చిత్రంలో ఎంపిక కాబోతున్న హీరోయిన్‌ కు నటిగా నిరూపించుకునే అవకాశం రావడంతో పాటు, తప్పకుండా మంచి గుర్తింపు కూడా రావడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

Tags:    

Similar News