కోట్లకు కోట్లు పెట్టే చోట.. ఒక చిన్న తప్పు చేసినా తీవ్రమైన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన దర్శకులు స్క్రీన్ ప్లే పరంగా అద్భుతాలు చేయాలన్న తపనతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అవి ఒక్కోసారి క్లిక్కవ్వచ్చు. కొన్నిసార్లు ఫెయిలవ్వచ్చు. అందుకు పాన్ ఇండియా మూవీ `సాహో` స్క్రీన్ ప్లే పెద్ద ఎగ్జాంపుల్ అంటూ క్రిటిక్స్ విశ్లేషించారు. ఇందులో ఒకే సన్నివేశాన్ని పదే పదే రిపీట్ చేస్తూ రివర్స్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ ని ఎంచుకున్నా అదేమంత వర్కవుట్ కాలేదు. తాము ఏదైతే ఆశించారో దానిని కనెక్ట్ చేయడంలో లేదా ఆడియెన్ ని ఎగ్జయిట్ చేయడంలో ఫెయిలయ్యారు. దానిపై తీవ్ర విమర్శలే వెల్లువెత్తాయి.
అయితే అప్పుడు సుజీత్ చేసిన తప్పును మరోసారి ప్రభాస్- రాధాకృష్ణ బృందం చేయరు కదా? ప‌్రతిసారీ తాము ఎంచుకునే కథలో స్క్రీన్ ప్లేలో ఏదో ఒక కొత్తదనం కావాలని తపించడం తప్పు కాదు. కానీ ప్రెజెంటేషన్ లో లోటుపాట్లు లోపాలు ఉంటేనే తప్పు. ఈసారి కూడా రాధేశ్యామ్ కోసం రివర్స్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ ని ఎంచుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అది ఉత్సాహపరిచే ఆలోచనే. ఒక అందమైన ప్రేమకథకు స్క్రీన్ ప్లే మ్యాజిక్ యాడైతే దాని స్థాయి వేరే లెవల్లో ఉంటుంది. హాలీవుడ్ లో సోర్స్ కోడ్ .. తమిళ చిత్రం జర్నీలో అది బాగానే వర్కవుటైంది. కానీ అన్ని సినిమాల్లో వర్కవుటవుతుందా? కనెక్ట్ చేసే సత్తా దర్శకులకు ఉందా? అన్నది కాస్త తరచి చూడాలి. ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రీకరణ హైదరాబాద్ పరిసరాల్లో సాగుతోంది.
ఇటలీ నేపథ్యంలోనూ ఈ మూవీ కీలక సన్నివేశాల్ని చిత్రీకరించిన సంగతి తెలిసినదే. ఈ చిత్రం టైమ్ ట్రావెల్ ఫిల్మ్ అని కొందరు.. రెండు కాలాదుల్ని కలుపుతూ ప్రేమకథను ఎలివేట్ చేశారని.. రివైండ్ తరహా స్క్రీన్ ప్లే రివర్స్ స్క్రీన్ ప్లే వంటివి ప్రధాన భూమికను పోషిస్తాయని రకరకాలుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం రెండు సార్లు రిపీటయ్యే సీన్లతో అద్భుత స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తుందని ఆడియెన్ ని సర్ ప్రైజ్ చేస్తుందని ప్రచారమవుతోంది.
అయితే ఈ స్క్రీన్ ప్లేని వర్కవుట్ చేయడం చాలా గమ్మత్తైన విషయమే అవుతుంది. సరిగ్గా కుదిరితే సంచలనమే. కొంచెం లోపం ఉన్నా పెద్ద ఖర్చు అవుతుంది. బడ్జెట్ రెట్టింపు ఖర్చు చేయాలి. అంత పెట్టేప్పుడు ఈ స్క్రీన్ ప్లే అంశం ప్రేక్షకులను ఆకట్టుకుని తీరాలి. దర్శకుడు ష్యూర్ షాట్ మేధోతనంతో బాగా క్లిక్ చేయాలి. సెకెండ్ ఫిలిం డైరెక్టర్ రాధా కృష్ణ దాన్ని ఎలా వర్కవుట్ చేస్తారు? అన్నది ఆసక్తికరం. ప్రభాస్- పూజాహెగ్డే జంట లుక్ రిలీజయ్యాక మూవీపై ఆసక్తి పెరిగింది. అది నిలబెడుతూ క్లిక్ చేయాల్సిన బాధ్యత రాధాకృష్ణ అండ్ టీమ్ పై ఉంది.