కేఆర్ విజ‌య‌కు ఆ పేరు అలా వ‌చ్చింద‌ట‌!

Update: 2018-07-09 05:39 GMT
ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ కు కేఆర్ విజ‌య అంటే పెద్ద‌గా గుర్తు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. కానీ.. 70.. 80ల‌లోపుట్టిన వారికి ఆమె సుప‌రిచితం. ఆ మాట‌కు వ‌స్తే 90ల‌లో పుట్టినోళ్లు కూడా కేఆర్ విజ‌య ప‌రిచ‌య‌మే. కాకుంటే.. పాత సినిమాలు త‌ర‌చూ చూసే వారికి ఆమె బాగా తెలుసు.

చూసినంత‌నే దేవ‌తా స్వ‌రూపంగా క‌నిపించే ఆమెను చాలామంది దేవ‌తామూర్తిగా కొలుస్తుంటారు. తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఆమె ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆమెకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాలు చెప్పుకొచ్చారు. కేఆర్ విజ‌య‌గా తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితురాలైన ఆమె.. అస‌లు పేరు అది కాద‌న్నారు.

ఆమె అస‌లు పేరు దేవ‌నాయ‌కిగా చెప్పారు. త‌న పేరు మార‌టం వెనుక జ‌రిగింది చెబుతూ.. "ఒక సినిమా కోసం మేక‌ప్ వేసుకొని టెస్ట్‌ కు వెళ్లా. ఆ సినిమాలో న‌ట‌డు ఎంఆర్ రాధా. ఆయ‌న న‌టి రాధిక తండ్రి న‌టిస్తున్నారు. నా పేరు అడిగితే.. దేవ‌నాయ‌కి అని చెప్పా. పేరు బాగోలేద‌న్న ఆయ‌న విజ‌య అని మార్చుకోమ‌న్నారు. మా నాన్న పేరు రామ‌చంద్ర‌న్.. అమ్మ పేరులోని క‌ల్యాణి రెండు పేర్లు వ‌చ్చేలా కేఆర్ విజ‌య‌గా మార్చుకున్నా. అప్ప‌టి నుంచి ఆ పేరు అలా ఉండిపోయింది" అని చెప్పారు.

త‌న తండ్రి తెలుగువార‌ని.. ఆయ‌న‌ది చిత్తూరుగా చెప్పారు. నిర్మాత నాగ‌య్య ప‌క్కిల్లే త‌మ‌ద‌న్న విజ‌య‌.. అమ్మ మ‌ల‌యాళీ అని.. వారిద్ద‌రిది ల‌వ్ మ్యారేజ్ అని వెల్ల‌డించారు. తాను ప‌దేళ్లు కేర‌ళ‌లోని త్రిస్సూర్ లో పెరిగిన విష‌యాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

Tags:    

Similar News