''పుష్ప: ది రూల్'' సినిమాలో 'ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా' అనే ఐటమ్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్ లో ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్ తో వచ్చిన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన అందాలతో కనువిందు చేసింది. తన కెరీర్ లో తొలి స్పెషల్ సాంగ్ తోనే ఓ ఊపు ఊపేసిందని చెప్పాలి.
యూట్యూబ్ టాప్ 100 వీడియోస్ గ్లోబల్ లిస్టులో మొదటి స్థానాన్ని దక్కించుకుందంటేనే 'ఊ అంటావా మావా' పాట క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ప్రత్యేక గీతం సోషల్ మీడియాను షేక్ చేసిందనే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ విన్నా ఊ అంటావా మావా పాటే వినిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ 'ఊ అంటావా' పాటకు ఫిదా అయిపోయారు.
ఇప్పుడు నెట్టింట ఈ పాటకు సంబంధించిన రీల్స్ - సరదా పేరడీ సాంగ్స్ వేల కొలదీ దర్శనమిస్తున్నాయి. టీవీ ప్రోగ్రామ్స్ లో డ్యాన్స్ షోలలో ఎక్కడ చూసినా 'ఊ అంటావా' అంటూ ఊగిపోతున్నారు. సామాన్య ప్రేక్షకుల నుండి సెలబ్రిటీల వరకు అందరికీ ఈ సాంగ్ అంతలా ఎక్కేసింది. తాజాగా అలనాటి బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ ఫేవరేట్ సాంగ్స్ లో లిస్టులో 'పుష్ప' ఐటమ్ నంబర్ చేరిపోయింది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మాధురీ.. అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' పాటకు తన ముఖ కదలికలతో అభినయించింది. అంతేకాదు ప్రస్తుతం ఇది తన ఫేవరేట్ సాంగ్ అని క్యాప్షన్ పెట్టింది. ఆల్రెడీ హిందీ వెర్షన్ సాంగ్ అందుబాటులో ఉండగా.. తెలుగు పాట మాధురీ మనసు దోచుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.
కాగా, మాధురి దీక్షిత్ తన అందం, అభినయంతో పాటు ఆమె డ్యాన్స్ లతో కొన్నేళ్ల పాటు సినీ అభిమానులను అలరించింది. స్టార్ హీరోలందరి సరసన నటించి దశాబ్ధకాలానికి పైగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నెం.1 హీరోయిన్ గా కొనసాగింది. వివాహం తర్వాత సినిమాలకు దూరమైన మాధురీ.. మళ్ళీ రీఎంట్రీతో అదరగొడుతోంది. మాధురీ ప్రస్తుతం సినిమాలతోనే కాకుండా డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతోంది.