సెలబ్రిటీ లైఫ్ లో పార్టీలు ఒక భాగం. కొత్త సినిమా ప్రారంభమైనా.. రిలీజ్ ముందు ప్రీరిలీజ్ జరిగినా .. అటుపై పెద్ద విజయం సాధించినా వైన్ అండ్ డైన్ పార్టీ కామన్. ముఖ్యంగా మద్యం పార్టీ తప్పనిసరి అయ్యింది. ఈ కల్చర్ ఇతర పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ లో ఇటీవల మరీ ఎక్కువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిసారీ ఏదో ఒక మిషతో మద్యం పార్టీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ పబ్ ల్లో...ఐదు నక్షత్రాల హోటళ్లలో నిత్యం సినిమా వాళ్ల పార్టీలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా సీనియర్ పాత్రికేయుడు- దర్శకుడు ఇమంది రామారావు రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టిన రోజు సందర్భంగా జరిగిన పార్టీపైనా... ఆయన ఇచ్చే ప్రత్యేక పార్టీల గురించి.. మద్రాసు ఇండస్ట్రీ రోజుల్లో సినీ ప్రముఖుల పార్టీలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
సినిమా వాళ్లు తాగకుండా ఒక్క రోజు కూడా ఉండలేరు. ఎందుకంటే వారి జీవితంలో ప్రతిరోజూ ఏదో ఒక సినిమా మొదలవుతుంది. వాటికి సంబంధించిన పార్టీలు అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో తాగుతూ ఉంటారు అని తెలిపారు. ``అయితే పచ్చ కామెర్లు వస్తే పత్యం ఉండాలి. మద్యం అసలు తాగకూడదు. ఒకవేళ చిత్ర పరిశ్రమకు చెందిన వారిలో ఎవరికైనా పచ్చ కామెర్లు వస్తే... వారు వెంటనే కృష్ణం రాజును సంప్రదించేవారు. ఆయన హస్తవాసి చాలా మంచిది. పచ్చ కామెర్లు వెంటనే తగ్గిపోయేవి`` అని ఓ కొత్త విషయాన్ని ఇమంది వెల్లడించారు.
కృష్ణంరాజు ఇంట్లో భోజనం చేయడం అంటే అదో పెద్ద సవాల్. కడుపునిండా రకరకాల ఐటమ్ లతో భోజనం పెడతారు. అలాంటి డిషెస్ ఎక్కడా కనిపించవు. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ అక్కడ ప్రత్యేకత.. అని ఇమంది తెలిపారు. ``రెబల్ స్టార్ రాజవంశీకుడు. కృష్ణం రాజుకు పిల్లలు లేరు. ఆయన తమ్ముడు సూర్య నారాయణ రాజు కుమారుడే ప్రభాస్. కృష్ణంరాజుకు సంబధించిన పనులన్నీ అతని తమ్ముడే చూసుకునేవారు. అతని మాటే కృష్ణం రాజు మాట. అందుకే కృష్ణం రాజు ప్రభాస్ ని సొంత బిడ్డలా చూసుకుంటారు...`` అంటూ బోలెడన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ ని రివీల్ చేశారు సీనియర్ జర్నలిస్టు ఇమంది. అన్నట్టు సెలబ్రిటీల మందు పార్టీలపై సీనియర్ జర్నలిస్టు ఇమంది ఎంతో అనుభవ పూర్వకంగా చూసినవన్నీ అదిరిపోయే లీకులిచ్చారు మరి.