`మా` అధ్య‌క్ష ప‌ద‌వికి సీనియ‌ర్ న‌రేష్ విర‌మ‌ణ‌.. క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ఆదేశం!

Update: 2021-06-26 10:30 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)కు గ‌త రెండేళ్లుగా అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న సీనియ‌ర్ న‌రేష్ త‌న ప‌ద‌విని విర‌మించారు. త‌న క‌మిటీ విర‌మించింద‌ని తెలిపారు. మీడియా స‌మావేశంలో ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎమోష‌న‌ల్ స్పీచ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. తాను రెండేళ్లుగా మా అసోసియేష‌న్ కి స్వార్థం లేకుండా సేవ‌లందించాన‌ని తెలిపారు.

`మా` మాజీ అధ్య‌క్షుడు వీ.కే న‌రేష్ మాట్లాడుతూ-``త‌న పుట్టిన‌రోజున ప్ర‌తిసారీ మాకి విరాళాలు అందించారు అమ్మ‌(విజ‌య నిర్మ‌ల‌). ప్ర‌తి నెలా మాకు 15 వేలు పంపించేవారు అమ్మ‌. ప్ర‌తి సంవ‌త్స‌రం త‌న బ‌ర్త్ డే రోజున‌ ఏజ్ సంఖ్య‌కు త‌గ్గ‌ట్టు అన్ని వేలు ఇచ్చారు త‌న క‌ష్టార్జితం నుంచి. వ‌య‌సు 78 అయితే 78 వేలు ఇచ్చారు. ఇన్నేళ్ల‌లో తాను ఉన్న‌న్నాళ్లు 30ల‌క్ష‌ల విరాళాలు అందించారు. కానీ అమ్మ మేం ఏ ప‌ద‌విని కోరుకోలేదు. నేను ఇప్పుడు నెల‌కు 20 వేల చొప్పున మాకు విరాళంగా అందిస్తున్నాను. ఇది మా గొప్ప కోసం చెప్ప‌డం లేదు. ఏ స్వార్థం లేకుండా చేసాం సేవ‌లు. 20 ఏళ్లుగా నేనేమీ ప‌ద‌వులు అడ‌గ‌లేదు. ప్రెసిడెంట్ అవుతాన‌ని అన‌లేదు. దాసరి గారు.. జ‌య‌సుధ గారు పిలిచి అడిగారు`` అని తెలిపారు.

ఈరోజు మా క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ప‌ద‌విని విర‌మించ‌మ‌ని అడిగింది. ఇప్పుడు నా అధ్య‌క్ష‌ప‌ద‌వికి విర‌మించాను. మావాళ్లు విర‌మించారు.. అని సీనియ‌ర్ న‌రేష్ అన్నారు. సెప్టెంబ‌ర్ లో మా అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కొత్త అధ్య‌క్షుడిగా అవ‌కాశం ఎవ‌రిని వ‌రించ‌నుందో వేచి చూడాలి.
Tags:    

Similar News