విజయ్ దేవరకొండ హవా కొనసాగుతోంది. మధ్యలో 'నోటా' తో స్పీడ్ బ్రేకర్ తగిలినట్టుగా స్లో అయినా మళ్ళీ 'టాక్సీవాలా' తో మళ్ళీ టాప్ గేర్ లోకి వచ్చాడు. విజయ్ ఇప్పటివరకూ చేయని థ్రిల్లర్ జోనర్ ఫిలిం కావడం.. సినిమా కూడా డిఫరెంట్ ఉండడంతో ప్రేక్షకులకు మంచి ఆదరణ దక్కుతోంది.
ఇదిలా ఉంటే 'టాక్సీవాలా' మొదటిరోజు హిట్ టాక్ రాగానే 'టాక్సీవాలా' టీమ్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. 'టాక్సీవాలా' టీమ్ తో పాటుగా అల్లు అరవింద్.. దర్శకుడు మారుతి కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ ఆనందంలో అల్లు అరవింద్ భుజాల మీద చేయి వేసి నిలబడడం జరిగింది. ఈ ఫోటో కూడా మీడియాలో బయటకు వచ్చింది. విజయ్ అలా చేయడం అక్కడ ఉన్న చాలామందికి నచ్చలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అరవింద్ టాలీవుడ్ లో ఉన్న సీనియర్స్ లో ఒకరని.. అయనతో కుర్ర హీరో ఇలా ప్రవర్తించడం బాగాలేదని వారు అప్సెట్ అయ్యారని టాక్.
ఇదే విషయాన్ని అరవింద్ సన్నిహితులు విజయ్ తోనే డైరెక్ట్ గా చెప్పారట. తన ఉద్దేశం అయనను తక్కువ చేయడం కాదని.. అరవింద్ గారు మా నాన్నగారితో సమానం అని ఆయనపై అభిమానంతోనే అలా చేశానని.. వాళ్ళకు వివరణ కూడా ఇచ్చాడట. మొత్తానికి ప్రేమ..అభిమానంలో కూడా రౌడీ యాంగిలే.. గౌరవం.. అణకువ..కనిపించడం లేదే అని ఈ ఫోటోను చూసిన నెటిజనులు విజయ్ పై సెటైర్లు వేస్తున్నారు.