సీనియర్ నటి నీనా గుప్తా ఇండియాలోని టాలెంట్ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమె సినీ, టెలివిజన్ రంగాల్లో రాణిస్తున్నారు. ముక్కు సూటిగా మాట్లాడటంతోపాటు ఎలాంటి ఇమేజ్ ట్రెండ్ కు లోను కాకుండా తనకు నచ్చిన పాత్రలు చేస్తూ నీనా గుప్తా అందరి ప్రశంసలను దక్కించుకుంటున్నారు.
నీనా గుప్తా తాజా చిత్రం 'ఉంచాయి' రేపు (నవంబర్ 4న) విడుదలవుతోంది. ఈ సినిమాకు సూరజ్ బర్జత్యాస్ దర్శకత్వం వహించారు. ఇందులో అమితాబ్ తో కలిసి నీనా గుప్తా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నీనా గుప్తా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో చిత్రసీమలో తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు.
గత మూడు దశాబ్దాలుగా తాను సినిమా.. టెలివిజన్ రంగాల్లో ఎన్నో పాత్రలు చేశానని చెప్పింది. తన కెరీర్ గురించి ఆలోచిస్తే ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. అయితే తాను వేసుకునే దుస్తులను బట్టి మీడియా.. సినీ వర్గాలు క్యారెక్టర్ ను డిసైడ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. కెరీర్ తొలినాళ్లలోనే తాను వేసుకునే దుస్తులను చూసి దర్శక, నిర్మాతలు తనకు బోల్డ్.. వ్యాంప్ క్యారెక్టరే ఇచ్చే వారన్నారు.
తాను వేసుకునే దుస్తులను చూసి కొందరు తాను ఇండియన్ ఉమెనా? లేదా గ్లామర్ యాక్టర్ అనే మీమాంసలో ఉండేవారని తెలిపింది. అయితే టెలివిజన్ రంగంలో తాను సంప్రదాయకంగా ఉండే అమ్మ.. అక్క పాత్రలు చేసి మెప్పించినట్లు గుర్తు చేశారు. దీంతో దర్శకులు తనకు ఎలాంటి పాత్రలను ఆఫర్ చేయాలో తెలియక కన్ఫ్యూజర్ అయ్యేవారని నీనా గుప్తా తెలిపింది.
'బాదాయి హో' సినిమాలో తాను ఒక మిడిల్ క్లాస్ గృహిణిగా నటించానని తెలిపింది. ఈ పాత్ర తనకు నేషనల్ అవార్డును కూడా తెచ్చి పెట్టిందన్నారు. కాగా ఈ సినిమాలో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా తనకు ఈ పాత్ర ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పింది. తాను చాలా హాట్ ఉంటానని.. మిడిల్ క్లాస్ గృహిణి పాత్రకు తాను సరిపోదని నిర్మాతతో వాదించరని చెప్పింది.
ఆ తర్వాత జాకీ ష్రాఫ్ తో తాను నటించిన 'కుజ్లీ' అనే షార్ట్ ఫిలీంను నిర్మాతలు ఆయనకు చూపించి ఒప్పించారని తెలిపారు. ఆ సినిమాలో తాను చేసిన గృహిణి పాత్రకు మంచి ప్రశంసలు దక్కడంతోపాటు నేషనల్ అవార్డు కూడా వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. వేసుకునే దుస్తులను బట్టి.. వ్యక్తిత్వాన్ని బట్టి సినిమాలో ఆఫర్లు ఇవ్వకూడదని తెలిపింది.
డాక్టర్ పాత్ర చేయాల్సిన వచ్చిన డాక్టర్ ను తీసుకోరు కాదా? అని ప్రశ్నించింది. నటి అంటే అన్ని పాత్రల్లో జీవించాల్సి ఉంటుందని తెలిపారు. కేవలం తాను వేసుకునే దుస్తుల కారణంగా మీడియా తనను నెగిటివ్ గా ప్రచారం చేసిందని తెలిపారు. దీంతో దర్శకులు తనకు బోల్డ్.. వ్యాంప్ క్యారెక్టర్లే ఎక్కువగా ఆఫర్ చేసే వారన్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని నీనా గుప్తా తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.