బాహుబ‌లిలో తప్పులు చెబుతున్నాడు

Update: 2015-11-28 05:20 GMT
జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. రికార్డు స్థాయి వ‌సూళ్లు సాధించి, దేశంలోనే టాప్ -3 గ్రాస‌ర్‌ గా నిలిచింది. ఇలాంటి సినిమాపై ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌లు కూడా వ‌స్తూనే ఉన్నాయి. అప్ప‌ట్లో సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ బాహుబ‌లి త‌న‌కి న‌చ్చ‌లేద‌ని కామెంట్ చేశాడు. అయితే అది అత‌డి వ్యూ ఆఫ్ పాయింట్ లో ఓ ఒపీనియ‌న్ మాత్ర‌మే. అయితే ఈ సినిమాకి ప‌నిచేసిన టాప్ సినిమాటోగ్రాఫ‌ర్ త‌న సినిమాని తానే క్రిటిసైజ్ చేసుకున్నాడు.

బాహుబ‌లి చిత్రంలో కొన్ని అసంతృప్తిని మిగిల్చాయి. ఈ మూవీ సీజీ ప‌నులు పూర్త‌య్యాక పూర్తిగా రూపం మారిపోయింది. సీజీ చేశాక చాలా త‌ప్పులు క‌నిపించాయి. మోష‌న్‌ లో బ్ల‌ర్ క‌నిపించింది. బ్యాక్‌ గ్రౌండ్ ఫీల్డ్ (లొకేష‌న్‌)లో కొన్ని ఇష్యూస్ క‌నిపించాయి. చాలా సీన్స్‌ లో కొన్ని త‌ప్పులు క‌నిపించాయి. కంప్యూట‌ర్ గ్రాఫిక్స్‌ లో కొన్ని ఫేక్‌.. అంటూ క్రిటిసైజ్ చేశాడు. ఈ అసంతృప్తి నుంచి బైట‌ప‌డేలా రెండో సినిమాకి ప‌నిచేసేందుకు రెడీ అవుతున్నాన‌ని చెప్పాడు.  ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింఫెస్ట్ వేడుక‌లో సెంథిల్ పై విధంగా స్పందించాడు.

ఎలాగూ బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. కాబ‌ట్టి ఇప్పుడు త‌ప్పులు వెతుక్కున్నా త‌ప్పేం లేదు. అయితే ఇవేవీ కామ‌న్ జ‌నం గుర్తించేంత పెద్ద మిస్టేక్స్ కావు. ఒక టెక్నీషియ‌న్‌ గా సెంథిల్‌ కి మాత్ర‌మే క‌నిపించే త‌ప్పులు. ఇత‌ర‌త్రా టెక్నీషియ‌న్లు గుర్తించ‌గ‌లిగేవి మాత్ర‌మే.
Tags:    

Similar News