సినీ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. ప్రతి యేడాది మూడు వందలకు పైగా సినిమాల నిర్మాణం జరుపుకుంటాయి కానీ.. అందులో హిట్ చిత్రాల శాతం 5 మాత్రమే ఉంటుంది. పాండమిక్ తర్వాత పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జనాలు థియేటర్లకు రావడం తగ్గించడంతో బాక్సాఫీస్ కు కళ తప్పిపోయింది. కాకపోతే నెలకో రెండు మూడు హిట్లు పడుతుండటంతో ఊపిరి పోసుకుంటోంది.
ఆగస్టు నెలలో 'బింబిసార' 'సీతా రామం' మరియు 'కార్తికేయ 2' వంటి మూడు సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని.. ఆదరిస్తారని ఈ చిత్రాలు మరోసారి నిరూపించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో అనేక పెద్ద, చిన్న - మీడియం రేంజ్ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి థియేటర్లకు క్యూ కడుతున్నాయి.
ఈరోజు సెప్టెంబర్ 2వ తేదీన పంజా వైష్ణవ్ తేజ్ మరియు కేతిక శర్మ జంటగా నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా రిలీజ్ కాబోతోంది. గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ శుక్రవారం 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అనే సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ కథ అందించిన ఈ చిత్రాన్ని ఏడిద నాగేశ్వరరావు మనవరాలు నిర్మించింది.
సునీల్ - ధన్ రాజ్ కలిసి నటించిన 'బుజ్జీ.. ఇలారా' సినిమాతో పాటుగా 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రం కూడా ఈరోజే విడుదల కాబోతున్నాయి. సెప్టెంబర్ 9వ తేదీన ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్న 'బ్రహ్మాస్త్ర: పార్ట్1-శివ' ప్రేక్షకుల ముందుకు రానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ - అలియా భట్ - అక్కినేని నాగార్జున - అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించారు.
శర్వానంద్ హీరోగా నటించిన తెలుగు తమిళ ద్విభాషా చిత్రం 'ఒకే ఒక జీవితం' కూడా ఈ నెల 9న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అదే రోజున కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' మూవీతో పాటుగా.. 'కొత్త కొత్తగా' అనే చిన్న సినిమా కూడా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. వీటికి ఒక రోజు ముందు సెప్టెంబర్ 8న ఆర్య 'కెప్టెన్' అనే డబ్బింగ్ మూవీ రానుంది.
విశాల్ నటించిన 'లాఠీ' సినిమా సెప్టెంబర్ 15వ విడుదల కాబోతోంది. మరుసటి రోజు 16న సుధీర్ బాబు - ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబోలో తెరకెక్కిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున సుధీర్ వర్మ దర్శకత్వంలో నివేద థామస్ - రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'శాకిని డాకినీ' చిత్రం రిలీజ్ కానుంది.
సెప్టెంబర్ 23న శ్రీ సింహా కోడూరి 'దొంగలున్నారు జాగ్రత్త' సినిమాతో పాటుగా నాగశౌర్య హోమ్ ప్రొడక్షన్ లో రూపొందిన 'కృష్ణ వ్రింద విహారి' చిత్రం రాబోతున్నాయి. అలానే సత్యదేవ్ - తమన్నా జంటగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' మరియు శ్రీ విష్ణు చేసిన 'అల్లూరి' సినిమాలు అదే డేట్ కి విడుదల కానున్నాయి. నెలాఖరున సెప్టెంబర్ 30న మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'PS:1' మూవీ రిలీజ్ అవుతుంది.
సెప్టెంబర్ లో ప్రస్తుతానికి ఈ 17 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకొని ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని చిన్నా చితకా చిత్రాలు కూడా అప్పటికప్పుడు విడుదల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్టు నెల టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఎలా కలిసొచ్చిందో.. ఈ నెల కూడా విజయవంతమైన చిత్రాలతో థియేటర్లు కిక్కిరిసిపోయేలా చేస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి వీటిల్లో ఏవేవి జనాదరణ దక్కించుకుంటాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.