వంద కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి.. మూణ్నాలుగేళ్ల పాటు ఎంతో శ్రమించి.. ‘మొహెంజదారో’ సినిమాను రూపొందించాడు బాలీవుడ్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్. ఐతే అతడి కష్టాన్ని.. ప్రయత్నాన్ని నెటిజన్లు మరీ తేలిక చేసి మాట్లాడేస్తున్నారు. ‘మొహెంజదారా’ ట్రైలర్ చూసి కామెడీ చేస్తున్నారు. వేల ఏళ్ల కిందటి మొహెంజదారో రాజ్యాన్ని గొప్పగా చూపించాలన్న ప్రయత్నంలో.. అశుతోష్ బేసిక్ థింగ్స్ మరిచిపోయాడని.. భారీతనం పేరుతో ఆధునికతను జోడించి సినిమాలో ఫీల్ చెడగొట్టేశాడన్నది నెటిజన్లు చేస్తున్న విమర్శ. మొహెంజదారో కాలంలో అసలు గుర్రాలే లేవట. కానీ అశుతోష్ గుర్రాల్ని పెట్టడం చరిత్రను వక్రీకరించడమే అంటున్నారు. ఇక హృతిక్ తో తలపడే ఇద్దరు యోధులు అమెరికన్ల తరహాలో ఉన్నారని.. మొహెంజదారోకు ఈ అమెరికన్ వలసవాదులు ఎప్పుడొచ్చారని ప్రశ్నిస్తున్నారు కొందరు.
హీరోయిన్ పూజా హెగ్డే వేసుకున్న డ్రెస్ డిజైనర్ వేర్ తరహాలో ఉందని.. ఆమెలో మోడర్న్ లుక్ కనిపిస్తోందన్ని ఇంకొందరి వాదన. హృతిక్ మీదికి మొసలి దూకే సన్నివేశం మీదా జోకులు పేలుస్తున్నారు జనాలు. ఇంకా ట్రైలర్లో చాలా అంశాలు చాలా మోడర్న్ గా కనిపిస్తున్నాయని.. అశుతోష్ చరిత్రను సరిగా అధ్యయనం చేయలేదని.. మొహెంజదారోను వాస్తవకోణంలో చూపించలేకపోయాడని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐతే ఈ విమర్శల్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే అని కొట్టి పారేస్తున్నారు ఇంకొందరు. ఐతే నేటివిటీ ఫ్యాక్టర్ ను పక్కనబెట్టేస్తే.. ట్రైలర్ ఎగ్జైటింగ్ గా ఉందన్నది మాత్రం వాస్తవం. అన్ని కోట్లు పెట్టి.. అంత కష్టపడి తీసిన సినిమాను మరీ తేలిగ్గా తీసేయడం కరెక్ట్ కాదు. కథాకథనాలు ఎలా ఉంటాయన్నది ముఖ్యం. అవి బాగుంటే సగటు ప్రేక్షకుడికి ఇలాంటి విషయాలు పట్టవు. మరి ఆగస్టు 12న తెరమీద ఏం జరుగుతుందో చూద్దాం.