సంక్రాంతి 2023 బరి నుంచి డబ్బింగ్ సినిమాలను నిషేధిస్తున్నట్టు ఫిలింఛాంబర్ నుంచి వెలువడిన అధికారిక ప్రకటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. పరిశ్రమ పై నిర్మాతల గిల్డ్ డామినేషన్ కి ఎదురెళ్లే ఒక సెక్షన్ నుంచి వెలువడిన ప్రకటనగా దీనిని పరిగణించారు. నిర్మాతల మండలి వర్సెస్ నిర్మాతల గిల్డ్ అంతర్గత పోరు ఎప్పుడూ తెలుగు సినీపరిశ్రమలో నివురుగప్పిన నిప్పులాంటిది.
ఇప్పుడు ఈ నిప్పు సంక్రాంతి 2023 కి చాలా ముందే రాజుకుంది. కచ్ఛితంగా ఈ సారి సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు మాత్రమే థియేటర్లు ఇవ్వాలని పంతం పడుతూ చాంబర్ లో పలువురు ప్రముఖులు హుకుం జారీ చేస్తుంటే మరోవైపు దీనిని ఖాతరు చేయని గిల్డ్ ప్రతినిధులు అయిన కొందరు అగ్ర నిర్మాతలు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ``ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ లో డబ్బింగ్ సినిమా పొరుగు సినిమా అంటూ ఉండదు.. ఏ సినిమా అయినా ఒకటే. సంక్రాంతి బరిలో డబ్బింగులను ఆపేది లేదు!`` అంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించడంతో అది కాస్తా సైలెంటుగా రాజుకుంది.
అయితే చిక్కంతా దిల్ రాజు వైపు నుంచే. ఆయన గత సంక్రాంతి బరిలో డబ్బింగ్ సినిమాలను ఆడనివ్వమని తెలుగు సినిమాలకు ప్రాధాన్యతనిచ్చాకే ప్రాధాన్యతా క్రమంలో చివరిలో అనువాద చిత్రాలకు థియేటర్లు ఇచ్చేలా రూల్ ని పాస్ చేసారు. దీంతో దానిని 2023 సంక్రాంతికి కూడా కొనసాగించాల్సిందేనంటూ ఛాంబర్ పెద్దలు కూడా అధికారికంగా నోటీస్ పంపారు. కానీ ఇప్పుడు సంక్రాంతి 2023 బరిలో ఉన్న అనువాద చిత్రం వారసుడు (వారిసు)ని దిల్ రాజు స్వయంగా రిలీజ్ చేస్తుండడంతో పెద్ద చిక్కొచ్చి పడింది. ఇంతకీ సంక్రాంతి బరిలో వారసుడు వస్తాడా..? రాడా..? రానివ్వకుండా కొందరు అడ్డుకుంటారా? అంటూ టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. ఒక రకంగా పెద్ద డిబేట్ దీనిపై రన్ అవుతోంది.
కానీ వీటన్నిటికీ విరుగుడుగా ఇప్పుడు ఒక టీజర్ ని చిత్రబృందం విడుదల చేసింది. దీని సారాంశం ప్రకారం.. వారిసు సంక్రాంతి 2023 బరిలో నిరభ్యంతరంగా విడుదలవుతుంది. ఆ మేరకు తమిళ పంపిణీదారులు నిర్ణయించుకున్నారు! అని వార్త వెలువడింది. దీనర్థం సంక్రాంతి రేసులో వారసుడిని ఎవరూ ఆపలేరని సంకేతాలివ్వడమే.
దళపతి విజయ్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూ దూకుడు మీదున్నాడు. గత సంక్రాంతికి అతడు నటించిన మాస్టర్ విడుదలైంది. ఈసారి వారిసు విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి తెలుగు సినిమాలకు ప్రాధాన్యతనిచ్చాకే చివరిలో అంటే కనుమ పండుగ తర్వాత ఈ సినిమా విడుదలయ్యేందుకు ఆస్కారం ఉందని ఒక సెక్షన్ గుసగుసలాడుతోంది. సంక్రాంతికి ముందు అన్నీ తెలుగు స్ట్రెయిట్ సినిమాలు .. కనుమ తర్వాత డబ్బింగ్ సినిమాలు విడుదలవుతాయంటూ ఒక సెక్షన్ జోస్యం చెబుతోంది. మరి దిల్ రాజు వర్గాలు ఏమంటాయో చూడాలి.