కూతురి బికినీ ఫోటోపై షారూక్ రిక్వెస్ట్

Update: 2016-07-02 09:41 GMT
సెలబ్రిటీలు - స్టార్ల వారసులంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. రాబోయే తరంలో కాబోయే స్టార్ల కింద భావించే అభిమానులు.. వారి ప్రతీ యాక్టివిటీపై కన్నేసి ఉంచుతారు. మంచి.. చెడు.. ఏదైనా సరే విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య బాలీవుడ్ లో వారసుల ట్రెండ్ బాగా మారింది. ఇలా ఆన్ లైన్ లో క్రేజ్ తెచ్చుకున్నపుడు సైలెంట్ గా ఉండే స్టార్లు.. తేడా వచ్చినపుడు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు.

రీసెంట్ గా షారూక్ ఖాన్ కూతురు సుహాన.. బికినీలో ఉన్న ఫోటో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ఓ బీచ్ లో విపరీతమైన మరీ చిట్టి డ్రస్ లో కనిపిస్తున్న ఈ 16 ఏళ్ల సుహాన ఫోటోకు.. మిశ్రమంగా స్పందనలు వచ్చాయి. కాబోయే హీరోయిన్ అప్పుడే రెచ్చిపోతోంది అన్నట్లుగా కామెంట్స్ వచ్చాయి. దీనిపై షారూక్ ఖాన్ చాలా ఫీలయిపోతున్నాడు. 'ఇప్పుడు సుహాన వయసు 16 ఏళ్లే. అంటే ఇంకా చిన్నపిల్లే. బీచ్ లో తమ్ముడు అబ్రామ్ తో ఆడుకుంటున్నప్పటి ఫోటోలను ఇలా నెట్ లో పెట్టడం.. దాన్ని వివాదం చేయడం దారుణం. దయచేసి వాటిని తొలగించమని అభ్యర్ధిస్తున్నా' అంటున్నాడు షారూక్.

ఓ తండ్రిగా కింగ్ ఖాన్ ఆవేదన చెప్పుకోదగ్గదే కానీ.. అభిమానుల ఉత్సాహానికి పగ్గాలు వేయడం కష్టం. అదే ఆ చిన్నది ఏదైనా మంచి పని చేసినా ఇలాంటి రెస్పాన్సే వచ్చేది కదా. అప్పుడు షారూక్ చాలా సంతోషించేవాడని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. జనాలకు నీతులు చెప్పే బదులు మంచినీ చెడునీ ఒకే రకంగా తీసుకోవాల్సిన అవసరం షారూక్ కే కనిపిస్తోంది.

Tags:    

Similar News