ఈ మధ్య బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన పదం నెపోటిజం. బంధుప్రీతి ఎక్కువగా ఉండడాన్ని నెపోటిజం అంటారు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ పదాన్ని వాడేసింది. కరణ్ జోహార్ ని ఉద్దేశించి ‘నువ్వు బంధుప్రీతికి పెట్టింది పేరు’ అని కంగనా అనడంతో బాలీవుడ్ లో కలకలం రేగింది. ఆ షో జరిగి మూడు నెలలు గడుస్తున్నా నెపోటిజం ఇంపాక్ట్ ఇంకా పోలేదు.
తాజాగా ఈ నెపోటిజం పై బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. షారుక్ నటించిన ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ చిత్రం ఈరోజు విడుదలయింది. ఈ సందర్భంగా షారుక్ మీడియాతో మాట్లాడాడు. అసలు తనకు నెపోటిజం పదానికి అర్థమే తెలీదంటున్నాడు షారుక్.
‘అసలు నెపోటిజం అన్న పదమే నాకు అర్థంకాదు. నాకు 25 ఏళ్లు ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి ముంబై వచ్చాను. ఇక్కడ అందరూ నన్ను అభిమానించి ఆదరించారు. అందుకే నాకు ఆ పదానికి అర్థం తెలీడంలేదు. ఎవరన్నా ఈ పదం గురించి చర్చిస్తున్నప్పుడు నెపోలియన్ గురించి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. నాకు ఇంగ్లిష్ వచ్చు. అయినా సరే ఆ పదానికి సరైన అర్థం మాత్రం తెలీదు. అటువంటపుడు నెపోటిజం గురించి నా అభిప్రాయం చెప్పలేను.’ అని షారుక్ అన్నాడు.
తన కొడుకు ఆర్యన్ కాలిఫోర్నియాలో ఫిల్మ్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాడని, తన పిల్లలు వాళ్ల కంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నానని షారుక్ చెప్పాడు. వాళ్లు తమ సొంత కాళ్లపై నిలబడాలని, ఒకవేళ వారు సినీరంగంలోకి వస్తానన్నా తనకు అభ్యంతరం లేదన్నాడు షారుక్. వాళ్లు తమ కెరీర్ ను ఎంచుకోవడంలో పూర్త స్వేచ్ఛనిస్తానని చెప్పాడు.