షారూక్ ఖాన్ లేటెస్ట్ మూవీ రాయీస్ థియేటర్లలోకి వచ్చేసింది. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వడోదరా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి ఫరీద్ ఖాన్ అనే వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా కోసం వ్యక్తి మృతికి కారణం అయ్యాడంటూ.. షారూక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. వీటిపై ఫరీద్ కుటుంబ సభ్యులు స్పందించారు.
'జరిగిన సంఘటన బాధ కలిగించేదే. అయితే.. మేమెవరం షారూక్ ఖాన్ కు వ్యతిరేకంగా లేము. ఈ సంఘటనలో షారూక్ తప్పు లేదు. తను నాకు కొడుకు లాంటి వాడు. కేవలం సినిమా ప్రమోషన్స్ కారణంగానే నా కొడుకు చనిపోలేదు. అక్కడ ఎక్కువ మంది జనాలు పోగవడంతో.. నా కుమారుడు మరణించాడు. మేమంతా అతడి కోసం ఎంతో ప్రార్ధించినా ఫలితం లేకపోయింది. అంత్యక్రియలకు సాయం చేసిన షారూక్ ఖాన్ కు కృతజ్ఞతలు' అని చెప్పింది ఫరీద్ ఖాన్ పఠాన్ తల్లి.
షారూక్ కు వ్యతిరేకంగా ప్రచారం వదలిపెట్టాలని చెప్పింది ఫరీద్ మేనకోడలు సమీనా షేక్. ఇలా చేసినంత మాత్రాన తన అంకుల్ తిరిగి రాడని.. షారూక్ ను విమర్శించడం సరికాదని ఆమె చెప్పింది. అంకుల్ అంత్యక్రియలకు షారూక్ సహాయకులు చాలా హెల్ప్ చేశారని ఆమె తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/