బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఆస్తులు రూ.3900 కోట్లకు పైనే అని ఈ మధ్యే వెల్లడైంది. ముంబయిలోని ఆయన ఇల్లు ‘మన్నత్’ మాత్రమే వందల కోట్ల విలువ చేస్తుంది. దాన్నో రాజ ప్రసాదం లాగా తీర్చిదిద్దుకున్నాడు షారుఖ్. అందులోని వసతులు చూస్తే కళ్లు తిరగడం ఖాయం. ఆయనకు బోలెడన్ని లగ్జీరియస్ కార్లున్నాయి. ఇంకా ఆయన ఏం కోరుకుంటే అది కాళ్ల ముందుకు వచ్చి చేరుతుంది. ఐతే కావాల్సినంత డబ్బు.. పేరు.. విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ.. తాను మాత్రం సన్యాసిలాగా బతుకుతానని చెబుతున్నాడు షారుఖ్. తనకు డబ్బు మీద కానీ.. విలాసవంతమైన జీవితం మీద కానీ ఏమాత్రం ఆసక్తి లేదని అంటున్నాడు కింగ్ ఖాన్.
‘‘నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోరికలు లేవు. నా కోసం నేను ఏమీ కొనను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలాసార్లు వారం రోజుల పాటు ఒకటే ప్యాంటుతో ఉంటాను. నేనసలు రెస్టారెంట్లకు వెళ్లను. ఇంట్లోనే తింటా. అది కూడా ఒకరకమైన తిండే. నా సినిమాలు విజయవంతమైనప్పుడూ సంబరాలు చేసుకోను. ఆ రకంగా చూస్తే నన్ను ఓ సన్యాసి అనుకోవచ్చు.
నేను డబ్బులు ఖర్చు చేసేది సినిమాలు తీయడానికి.. నా పిల్లల కోరికల్ని తీర్చడానికి మాత్రమే. అందులోనే నాకు ఆనందముంది. నేను ఢిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి ముంబయికి వచ్చాను. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ.. చేతిలో చిల్లిగవ్వ లేకుండానే ఈ స్థాయికి వచ్చాను. అందుకే నాకీ విలాసాల మీద పెద్దగా ఆసక్తి లేదు’’ అన్నాడు షారుఖ్.