బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మేకప్ వేసుకోవడానికి ముందుగానే సినిమా రంగంలో అన్ని విభాగాలపై పట్టు సాధించే పనిలో ఉన్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. షారుక్ వారసుడిగా ఆర్యన్ ఖాన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా? అని అభిమానులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. కానీ ఆర్యన్ ఖాన్ ఎంట్రీ మరో విధంగా జరిగేలా కనిపిస్తుందని తాజా సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది.
ఒకేసారి యంగ్ ట్యాలెంటెడ్ ఆర్యన్ ఖాన్ బహుళ ప్రాజెక్ట్ లు చేపట్టి షాక్ ఇచ్చాడు. తండ్రి నిర్మించిన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ లో తనలో క్రియేటివిటీని బయట పెట్టే ప్రయత్నం చేసాడు. సదరు నిర్మాణ సంస్థలో ఓ ఫీచర్ ఫిల్మ్ తో పాటు వెబ్ సిరీస్ ని స్వీయా దర్శకత్వంలో నిర్మించడానికి నడుం బిగించాడు.
ఈ రెండు ప్రాజెక్ట్ లకి ఆర్యన్ స్ర్కిప్ట్ రాయడమే కాకుండా డైరెక్ట్ చేయడం విశేషం. శని..ఆదివారం నాడు జరిగిన టెస్ట్ షూట్ కి హాజరయ్యాడు. ఆర్యన్ ఖాన్ ..అతని సిబ్బంది స్టూడియోలో చాలా సేపు ప్రిపరేషన్స్ కొనసాగించారు. షూటింగ్ కి వెళ్లడానికి ముందుగా అందరినీ ఒకే చోట చేర్చి ప్రాజెక్ట్ పై డిస్కస్ చేయడంతో పాటు స్నేహసోదర భావాన్ని పెంపోందించే ప్రయత్నం చేసారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. ముందుగా వెబ్ సిరీస్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఇక నిన్నటి రోజున సెట్స్ లో షాహిద్ కపూర్..మృణాల్ ఠాకూర్..ప్రీతమ్ కహానీ కనిపించారు. దీంతో ఇంత పెద్ద స్టార్ క్యాస్టింగ్ తో ఆర్యన్ పనిచేస్తున్నాడా? అన్న సందేహం తెరపైకి వస్తోంది.
అయితే వాళ్లు కేవలం స్నేహం కారణంగానే హాజరై ఉంటారని మరికొంత మంది అభిప్రాయం. ఈ సందర్భంగా షారుక్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించడం విశేషం. ''ఆర్యన్ కి నటనపై ఆసక్తి లేదని..దర్శకత్వం వహించాలని ఎప్పుడూ తనతో చెప్పేవాడని షారుక్ తెలిపారు. నాలుగేళ్లగా రచన..దర్శకత్వం పై దృష్టి పెట్టాడని.. దానికి సంబంధించి సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో శిక్షణ పొందాడు. ఇది అత్యుత్తమ స్థాయి అధ్యయనాల్లో ఒకటి. నా కుమార్తె మాత్రం నటించాలని కోరుకుంటుందని'' తెలిపారు.
ప్రస్తుతం షారుక్ కుమార్తె సుహానే ఖాన్ 'ఆర్చీ కామిక్స్' ఆధారంగా రూపొందించబడుతున్న జోయా అక్తర్ వెబ్ సిరీస్ ద్వారా లాంచ్ అవుతుంది.